AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిండిలో పురుగులు పడుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో నెలల తరబడి తాజాగా ఉంచుకోండి!

వంటగదిలో మనం ఎక్కువగా నిల్వ ఉంచుకునే వస్తువుల్లో పిండి పదార్థాలు ముఖ్యమైనవి. అయితే వర్షాకాలం లేదా తేమ ఎక్కువగా ఉండే సమయంలో గోధుమ పిండి, బియ్యం పిండి లేదా మైదాలో నల్లటి పురుగులు పట్టడం సాధారణ సమస్య. పిండిని పారేయలేక, వాడుకోలేక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. పిండిలో పురుగులు చేరకుండా ఉండేందుకు కొన్ని అద్భుతమైన చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Mar 14, 2026 | 8:38 PM

Share
మనం నిత్యం వాడే గోధుమ పిండి, బియ్యం పిండి లేదా శనగ పిండిలో తేమ చేరడం వల్ల త్వరగా పురుగులు పట్టే అవకాశం ఉంటుంది. దీనివల్ల పిండి పాడైపోవడమే కాకుండా వంటల రుచి కూడా మారుతుంది. రసాయనాలు వాడకుండా ఇంట్లోనే లభించే సహజ పదార్థాలతో ఈ సమస్యను ఎలా పరిష్కరించవచ్చో ఇక్కడ తెలుసుకుందాం..ఈ చిట్కాలు పిండిని ఎక్కువ కాలం తాజాగా ఉంచడమే కాకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని భుజించేలా చేస్తాయి.

1 / 6
బిర్యానీ ఆకులు: బిర్యానీ ఆకులకు ఉండే ప్రత్యేకమైన, ఘాటైన వాసన పురుగులకు అస్సలు పడదు. మీరు పిండిని నిల్వ చేసే డబ్బాలో 2 లేదా 3 బిర్యానీ ఆకులను వేసి ఉంచండి. ఈ వాసన వల్ల పురుగులు లోపలికి ప్రవేశించవు.

2 / 6
ఎండు మిర్చి, లవంగాలు: పిండి డబ్బాలో కొన్ని ఎండు మిరపకాయలు లేదా 5-6 లవంగాలను వేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వీటిలోని ఘాటు గుణాలు పురుగులను దరిచేరనివ్వవు. ముఖ్యంగా లవంగాలు తేమను కూడా కొంతవరకు పీల్చుకుంటాయి.

3 / 6
వేపాకులు : వేపాకుల్లో సహజ సిద్ధమైన క్రిమిసంహారక గుణాలు ఉంటాయి. కొన్ని ఎండిన వేపాకులను ఒక పలుచని కాటన్ వస్త్రంలో కట్టి పిండి డబ్బా అడుగున వేయండి. ఇది పిండిని పురుగులు పట్టకుండా రక్షించడమే కాకుండా బ్యాక్టీరియా చేరకుండా చూస్తుంది.

4 / 6
ఎయిర్ టైట్ కంటైనర్లు: పిండిని నిల్వ చేసే విధానం కూడా చాలా ముఖ్యం. గాలి చొరబడని స్టీల్ లేదా గాజు డబ్బాల్లో నిల్వ చేయడం వల్ల తేమ లోపలికి వెళ్లదు. ప్లాస్టిక్ కవర్లలో ఉంచడం కంటే ఇలా చేయడం వల్ల పిండి ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది.

5 / 6
ఫ్రిజ్‌లో నిల్వ చేయడం: మీ దగ్గర తక్కువ పరిమాణంలో పిండి ఉంటే, దానిని ఒక జిప్ లాక్ కవర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచవచ్చు. తక్కువ ఉష్ణోగ్రత వద్ద పురుగులు పెరగలేవు. పిండిని వాడే ముందు ఒకసారి ఎండలో పెట్టడం లేదా తేలికగా వేయించడం వల్ల కూడా పురుగులు రాకుండా ఉంటాయి. పిండిని నిల్వ చేసే డబ్బా ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. తడి చేతులతో పిండిని తీయడం మానుకోవాలి.

6 / 6
Follow Us
అయోధ్య విరాళాల కేసుపై చంపత్ రాయ్ స్పష్టత..!

నా వల్ల కాదు బాబోయ్.. బిగ్ బాస్‏కు వెళ్లే ఓపిక నాకు లేదు..

గుడ్ల కంటే ఎక్కువ ప్రొటీన్ కావాలా?శాకాహారులకు వరంఈ 5 సూపర్ ఫుడ్స్

వరల్డ్ కప్ గెలిస్తే విన్నర్ కు ఎన్ని కోట్లు వస్తుందో తెలుసా ?

మరోసారి రెచ్చిపోయిన ర్యాప్ గ్యాంగ్.. తక్కువ ధరకే బంగారం అంటూ..

జూలై 2026 మాసఫలాలు: ఆర్థిక విషయాల్లో వారికి శుభవార్తలు..

వివాదంలో ఐపీఎల్ క్రికెటర్.. పోలీస్ కేసు నమోదు!

మీరు బంగారంపై రుణం తీసుకుంటున్నారా? మీకో భారీ గుడ్‌న్యూస్‌..!

బ్యాట్‌మ్యాన్‌లా దొంగల వేట,పట్టుకుని స్తంభాలకు కట్టేస్తున్న హీరో?

నల్లమల వెళ్లే పర్యాటకులకు బిగ్ అలర్ట్.. అమ్రాబాద్‌లో టైగర్ సఫారీ