AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆమె రేంజ్ వేరే ఉండేది.. కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుంది.. స్టార్ హీరోలు వచ్చినా లెక్క చేసేది కాదు.. బాబు మోహన్

సీనియర్ నటుడు బాబు మోహన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సుధీర్ఘ కాలంగా నటుడిగా అలరిస్తున్న ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఓ సీనియర్ హీరోయిన్ వ్యక్తిత్వాన్ని, ఆమెతో తన ప్రత్యేక అనుబంధాన్ని పంచుకున్నారు. ఆమె నిరాడంబరత, సినీ పరిశ్రమలో పారితోషికం కంటే గౌరవానికి ప్రాధాన్యతనిచ్చే విలువలను వివరించారు. నిర్మాతల ప్రాధాన్యతను, పరిశ్రమను బతికించుకోవాల్సిన అవసరాన్ని చెప్పుకొచ్చారు.

ఆమె రేంజ్ వేరే ఉండేది.. కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుంది.. స్టార్ హీరోలు వచ్చినా లెక్క చేసేది కాదు.. బాబు మోహన్
Babu Mohan
Rajitha Chanti
|

Updated on: Aug 12, 2026 | 2:03 PM

Share

సీనియర్ నటుడు బాబు మోహన్ ఒక ఇంటర్వ్యూలో దివంగత నటి సిల్క్ స్మితతో తన అనుబంధాన్ని, ఆమె వ్యక్తిత్వాన్ని, అలాగే సినీ పరిశ్రమలో తాను పాటించిన, పాటించాల్సిన విలువలను గురించి వివరంగా పంచుకున్నారు. సిల్క్ స్మిత, సౌందర్య వంటి గొప్ప నటీమణులు తొందరగా లోకాన్ని విడిచి వెళ్లడం బాధాకరమని బాబు మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. సిల్క్ స్మితను చాలా మంచి వ్యక్తిగా అభివర్ణించిన బాబు మోహన్, ఆమెకు ఉన్న ప్రత్యేకమైన ఆటిట్యూడ్‌ను వివరించారు. “ఆమె ఎవరినీ కేర్ చేయదు. ఎవరికీ నమస్కారం పెట్టదు. కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుంది. కళ్ళద్దాలు పెట్టుకుని అందరినీ చూస్తుంటుంది” అని అన్నారు. తాను ఒకసారి “ఈ నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని, కాలు మీద కాలు వేసి కూర్చుంటారు, ఎవరొచ్చినా తీయరు. మీరు నిద్రపోతారా? లేక అబ్జర్వ్ చేస్తారా?” అని అడిగానని బాబు మోహన్ చెప్పారు. దానికి సిల్క్ స్మిత, “అది కాదు బాస్, ఫూల్స్. నన్ను చూస్తారు. ఇలా ఇలా చూస్తారు నన్ను. అందుకనే నన్ను ఎవరు చూస్తున్నారా అని గమనిస్తూ ఉంటా నేను కళ్ళద్దాలు పెట్టుకొని” అని చెప్పిందని గుర్తుచేసుకున్నారు. హీరోలు వచ్చినా తీయని ఆమె, తనను చూడగానే మాత్రం కాలు తీసేదని, లేచి నిలబడేదని, తాను ఎక్కడ కూర్చుంటే అక్కడ వచ్చి కూర్చునేదని, తనను బాగా ఇష్టపడేదని బాబు మోహన్ ఆప్యాయంగా పంచుకున్నారు.

వారి మధ్య ఉన్న ప్రత్యేక బంధానికి నిదర్శనంగా ఒక సంఘటనను వివరించారు. ఒక ఫంక్షన్ కోసం దుబాయ్ వెళ్ళినప్పుడు, సిల్క్ స్మిత షాపింగ్‌కు వెళ్తూ తనను కూడా తోడు రమ్మని అడిగిందని తెలిపారు. తాను లిప్‌స్టిక్‌లు వంటివి కొనను కాబట్టి రానని చెప్పినా, ఆమె పట్టుబట్టి తీసుకెళ్లిందని చెప్పారు. షాపింగ్ తర్వాత బయటికి వచ్చిన సిల్క్ స్మిత, ఒక బ్లాక్ కళ్ళద్దాలు పెట్టుకుని “బాస్, ఎలా ఉంది?” అని అడిగిందని, తాను “సూపర్” అని బదులిచ్చానని బాబు మోహన్ అన్నారు. అది విన్న ఆమె “నిజంగా సూపరా? అయితే కొనేస్తున్నా” అని చెప్పి వాటిని కొనుగోలు చేసిందని, తర్వాత ఆ కళ్ళద్దాలను తనకు బహుమతిగా ఇచ్చిందని, “ఇది మీరు పెట్టుకోండి బాస్, నాకు కాదు, మీకు సూపర్” అని చెప్పిందని, ఆ కళ్ళద్దాలను తాను చనిపోయేదాకా దాచిపెట్టుకున్నానని ఆయన భావోద్వేగంతో పంచుకున్నారు.

సినీ పరిశ్రమలో పారితోషికాల గురించి మాట్లాడుతూ, తాను కానీ తన తోటి నటులు కానీ ఎప్పుడూ “ఇంత తీసుకుంటా, ఇంత ఇస్తేనే వస్తా” అని చెప్పలేదని బాబు మోహన్ అన్నారు. తమ రేటు ఇంత అని ఎప్పుడూ డిమాండ్ చేయలేదని, “మాయలోడు” పాట ఎంత పెద్ద హిట్ అయినా, మరుసటి సినిమాకు కూడా పారితోషికం పెంచమని అడగలేదని స్పష్టం చేశారు. చిరంజీవి గారు స్వయంగా పిలిచి “నీ పాటతో సినిమా సూపర్ హిట్ అయ్యింది” అని చెప్పినా, తనకు పెద్దగా ఫీలింగ్ కూడా రాలేదని, తాను “ఏమీ తెలియదు అన్నా” అని చెప్పానని గుర్తుచేసుకున్నారు. ఆ రోజుల్లో విలువలు ఉండేవని, నిర్మాతలు కూడా గౌరవం ఇచ్చేవారని, “మాకు ఇచ్చే గౌరవమే మా పారితోషికం” అనుకునేవారని బాబు మోహన్ తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి :  Tollywood: ఆ సినిమాను ఆ హీరో తప్ప మరెవరు చేయలేరు.. అందుకే నేను రిజెక్ట్ చేశా.. నటుడు సుమంత్..

సిల్క్ స్మిత..

Silk Smitha

Silk Smitha

ఎక్కువ మంది చదివినవి : Cinema : చనిపోయిన అమ్మాయిని వేధించే కుర్రాడు.. ప్రతి 20 నిమిషాలకు ఊహించని మలుపులు.. ఓటీటీని శాసిస్తున్న సినిమా..

Follow Us