అగ్నిపరీక్ష సీజన్ 2లో అద్భుత ప్రదర్శన కనబరిచి, న్యాయమూర్తులు నవదీప్, బిందుమాధవి, అభిజీత్లను ఇంప్రెస్ చేసి, పలు టాస్కులను గెలిచిన రాజకుమారికి ఊహించని షాక్ తగిలింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10కి అర్హత సాధించినప్పటికీ, జనాల ఓటింగ్లో వెనుకబడటంతో ఆమె బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లలేకపోయింది.