క్యూట్ బ్యూటీ, అందాల ముద్దుగుమ్మ శ్రీ లీల గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. ఈ అమ్మడు తన అందచందాలతో ఎంతో మంది మనసు దోచుకుంది.
పెళ్లిసందD మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన ఈ చిన్నది మొదటి సినిమాతోనే తెలుగు కుర్రకారు మనసు దోచుకుంది. అందరినీ ఆకట్టుకుంది.
తన గ్లామర్, డ్యాన్స్,డ్యాన్స్‌తో ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ రేంజ్‌లో గుర్తింపు సంపాదించుకుంది. అంతే కాకుండా తర్వాత ఏకంగా స్టార్ హీరో రవితేజ సరసన ఛాన్స్ కొట్టేసింది.
ధమాక మూవీలో ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీలో తన నటన మాత్రమే కాకుండా మాస్ డ్యాన్స్‌తో కుర్రకారుకు నిద్రలేకుండా, చేసింది, ఈ సినిమాతో యూత్ ఫేవరెట్ అయిపోయింది.
ఇక ఈ మూవీ కూడా సూపర్ హిట్ అవ్వడంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు క్యూట్ కట్టాయి. వరసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంది.
ఈ చిన్నది మహేష్ బాబు సరసన గుంటూరు కారం, నితిన్ సరసన ఎక్స్ ట్రా ఆర్డీనరీ మ్యాన్, రాబిన్ హుడ్ వంటి చాలా సినిమాల్లో నటించింది.
అంతే కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో నటించి, స్టార్ హీరోయిన్ లిస్టులో పడిపోయింది.
కేవలం తెలుగులోనే కాకుండా, కన్నడంలో కూడా కిస్, భరతే వంటి రెండు సినిమాల్లో నటించి మెప్పించిది. తమిళంలో పరాశక్తి మూవీలో నటించింది.