అసలు ఈ ముద్దుగుమ్మ ఏమైపోయిందబ్బా..!!

7 September  2026

Rajeev 

Pic credit - Instagram

ఒక్క కన్నుగీటుతో దేశవ్యాప్తంగా ‘వింక్ గర్ల్’గా గుర్తింపు తెచ్చుకుంది మలయాళం హీరోయిన్ ప్రియా ప్రకాశ్‌ వారియర్.

‘ఒరు అదార్ లవ్’ సినిమాతో సంచలనంగా మారిన ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.

ఒకేఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ గా మారిన ముద్దుగుమ్మల్లో ప్రియా ప్రకాష్ వారియర్ ఒకరు. ఈ క్రేజీ బ్యూటీ సినిమాలతో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కుగా బిజీగా గడిపేస్తోంది.

చేసింది తక్కువ సినిమాలే కానీ మంచి క్రేజ్ తెచ్చుకుంది. కేవలం ఒక్క వీడియో క్లిప్‌తో రాత్రికి రాత్రే పాపులర్ అయ్యింది ప్రియా ప్రకాష్ వారియర్.

కన్ను కొట్టి కుర్రకారును కట్టిపడేసింది. ఓరు ఆధార్ లవ్ అనే సినిమాతో పరిచయం అయ్యింది ఈ చిన్నది. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. కానీ ప్రియా ప్రకాష్ కు మంచి క్రేజ్ వచ్చింది.

ఆతర్వాత మలయాళంలో వరుసగా సినిమాలు చేసింది. ఇక తెలుగులో నితిన్ హీరోగా నటించిన చెక్ అనే సినిమాతో అడుగు పెట్టింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.

సినిమాలు లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటోంది. హాట్ ఫోటోలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది ఈ చిన్నది.