AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hanuman Movie: బ్లాక్ బస్టర్ ‘హనుమాన్’ సినిమాను మిస్ చేసుకున్న హీరోలు తెలుసా? ఒకరు కాదు ఇద్దరు రిజెక్ట్ చేశారు

2024 సంక్రాంతి కానుకగా రిలీజైన హనుమాన్ సినిమా సంచలన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ డివోషనల్ థ్రిల్లర్ మూవీలో తేజ సజ్జా హీరోగా నటించగా, అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటించింది.

Hanuman Movie: బ్లాక్ బస్టర్ 'హనుమాన్' సినిమాను మిస్ చేసుకున్న హీరోలు తెలుసా? ఒకరు కాదు ఇద్దరు రిజెక్ట్ చేశారు
Hanuman Movie
Basha Shek
|

Updated on: Sep 07, 2026 | 9:06 PM

Share

‘కొన్ని సినిమాలు కొందరికే రాసి పెట్టి ఉంటాయి’. ఇండస్ట్రీలో సినిమాలు చేతులు మారడం చాలా కామన్. ఒక హీరో/ హీరోయిన్ చేయాల్సిన సినిమా ఇంకో హీరో, హీరోయిన్ దగ్గరకు వెళ్లడం ఇక్కడ పరిపాటిగా జరుగుతుంటుంది. అలా చేతులు మారిన సినిమాలు ఒక్కోసారి హిట్ కావొచ్చు. మరోసారి ఫ్లాప్ కావొచ్చు. ప్రశాంత్ వర్మ- తేజ సజ్జా కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్ విషయంలోనూ ఇలాగే జరిగింది. 2024 సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కేవలం 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి ఏకంగా రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. కేవలం తెలుగులోనే కాదు హిందీ తదితర భాషల్లోనూ హనుమాన్ సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చాయి. హనుమాన్ సినిమాలో తేజ సజ్జా సరసన అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటించింది. అలాగేవరలక్ష్మీ శరత్ కుమార్ హీరో సోదరి పాత్రలో నటిస్తే వినయ్ రాయ్ క్రూరమైన విలన్ పాత్రలో భయపెట్టాడు. కాగా ఈ సినిమాలో భాగమైన వారికి మంచి గుర్తింపు వచ్చంది ముఖ్యంగా హనుమాన్ సినిమా విజయం తో హీరో తేజ సజ్జా రేంజ్ మారిపోయింది. పాన్ ఇండియా రేంజ్ లో అతనికి మంచి గుర్తింపు వచ్చింది. స్టార్ డైరెక్టర్లు సైతం తేజ సజ్జాతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే హనుమాన్ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తకర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. ఈ బ్లాక్ బస్టర్ మూవీకి హీరోగా తేజ సజ్జా ఫస్ట్ ఛాయిస్ కాదట.

దర్శకుడు ప్రశాంత్ వర్మ మొదట హనుమాన్ సినిమాను స్టార్ హీరోలతో చేయాలని భావించారట. అందుకోసం పలువురు స్టార్స్ ను సంప్రదించారట. అయితే వారు వివిధ కారణాలతో రిజెక్ట్ చేశారట. మొదట పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కు ఈ కథ వినిపించారట ప్రశాంత్ వర్మ. అయితే బన్నీకి ఈ స్టోరీ బాగా నచ్చినప్పటికీ అప్పటికే బిజీ షెడ్యూల్ తో ఉండడం వల్ల ఈ సినిమా చేయలేకపోయాడట. ఆ తర్వాత ఇదే స్టోరీతో న్యాచురల్ స్టార్ నానిని కలిశారట డైరెక్టర్. అయితే నాని కూడా వివిధ సినిమాలతో బిజీగా ఉండడంతో హనుమాన్ పై ఇంట్రెస్ట్ చూపించలేదట. దీంతో చివరికి తన ఫ్రెండ్ అయిన తేజ సజ్జాను ఈ సినిమాలో హీరోగా తీసుకున్నారట ప్రశాంత్ వర్మ. అంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జాంబిరెడ్డి సినిమా కూడా సూపర్ హిట్టుగా నిలిచింది. దీంతో తేజ సజ్జాని హీరోగా పెట్టి చాలా తక్కువ బడ్జెట్ లోనే హనుమాన్ సినిమాని బెస్ట్ అవుట్ పుట్ తో కంప్లీట్ చేశాడు ప్రశాంత్ వర్మ.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us