ఇద్దరు స్టార్స్ మధ్య నలిగిపోతున్న ఆ డైరెక్టర్
వరుస విజయాలతో దూసుకుపోతున్న సూర్య తన 50వ సినిమా కోసం లోకేష్ కనకరాజ్‌తో జతకట్టనున్నారు. విక్రమ్లోని రోలెక్స్ పాత్రతో ఈ చిత్రం రానుంది. లోకేష్ ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. సూర్య తన రాబోయే టీజే జ్ఞానవేల్, హెచ్ వినోద్ చిత్రాలు పూర్తయిన వెంటనే లోకేష్ ప్రాజెక్ట్‌లో చేరనున్నారు. ఈ సినిమా నిర్మాణానికి పలువురు నిర్మాతలు పోటీ పడుతున్నారు.
వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న సూర్య తన లైనప్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆయన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 50వ సినిమా కోసం భారీ ప్లాన్స్ సిద్ధం చేసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం మోస్ట్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ రంగంలోకి దిగనున్నారు. ప్రస్తుతం సూర్య జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేల్, నెక్స్ట్ హెచ్ వినోద్ సినిమాలలో నటించబోతున్నారు. ఈ రెండు చిత్రాలు పూర్తి కాగానే లోకేష్ కనకరాజ్‌తో కలిసి తన 50వ సినిమాను పట్టాలెక్కించనున్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రాబోయే సూర్య 50వ సినిమా విక్రమ్ క్లైమాక్స్‌లో కనిపించిన రోలెక్స్ పాత్రపై ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. ఈ క్యారెక్టర్ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉండటంతో, దాన్ని స్టాండ్ అలోన్ సినిమాగా తీసుకురావడానికి లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతానికి లోకేష్ కనకరాజ్ అల్లు అర్జున్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఇది పూర్తైన వెంటనే రోలెక్స్ సినిమాను ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించడానికి కలైపులి ఎస్ థాను సహా పలువురు నిర్మాతలు పోటీ పడుతున్నట్లు సమాచారం. లోకేష్ తన బన్నీ సినిమాతో పాటు రోలెక్స్ ప్రాజెక్ట్‌పై కూడా దృష్టి సారిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
బయోపిక్స్‌లో ఒదిగిపోతున్న హీరోయిన్లు
హీరోలను డామినేట్ చేస్తున్న విలన్లు
క్రేజీగా కమల్ లైనప్… షూటింగ్ స్టేటసేంటి?
టాలీవుడ్‌లో మరోసారి ముదురుతున్న డ్యాన్సర్స్ అసోసియేషన్ రచ్చ
థియేటర్లలో మున్నా భయ్యా రచ్చ.. మూవీగా ‘మిర్జాపూర్’ ఎలా ఉంది?
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం..
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్..
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్ఎంపీ డాక్టర్.. రాత్రయితే..
వైకల్యాన్ని జయించి మద్రాస్ ఐఐటీలో సీటు సాధించి..
దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి తాకిన దానిని చూసి

