బయోపిక్స్‌లో ఒదిగిపోతున్న హీరోయిన్లు
త్వరలో రాబోతున్న రెండు ప్రముఖ బయోపిక్స్ గురించి సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇండియన్ ఫేమస్ సింగర్ ఎమ్మెస్ సుబ్బలక్ష్మి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో రష్మిక మందన్న నటిస్తుండగా, జానపద కళాకారిణి విఠాబాయ్ నారాయణ్ గావ్‌కర్ పాత్రలో శ్రద్ధా కపూర్ కనిపించనున్నారు. ఇప్పటికే లుక్ టెస్ట్‌లు పూర్తైనట్లు సమాచారం.
చాలా రోజులుగా సినీ ప్రియులను సస్పెన్స్‌లో ఉంచిన బయోపిక్‌ల నటీనటులపై క్లారిటీ వచ్చేసింది. ఇండియన్ ఫేమస్ సింగర్ ఎమ్మెస్ సుబ్బలక్ష్మి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్న నటించనున్నారు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ బయోపిక్‌ను తెరకెక్కించనున్నారు. ఇప్పటికే రష్మికతో లుక్ టెస్ట్ కూడా పూర్తైనట్లు తెలుస్తోంది. అల్లు అరవింద్, రాక్‌లైన్ వెంకటేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.మరోవైపు, ప్రముఖ బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ కూడా బయోపిక్‌లో నటించేందుకు సిద్ధమయ్యారు. జానపద కళాకారిణి, డాన్సర్, తమాషా మహారాణిగా గుర్తింపు పొందిన విఠాబాయ్ నారాయణ్ గావ్‌కర్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఛావా ఫేమ్ లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈఠా అనే టైటిల్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో భారీ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు.
భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా
హైదరాబాద్ వాసులకు అలర్ట్..డిసెంబర్ నుంచి నీటి కష్టాలు తప్పవా?
చంద్రుడి పై నివాసాలు.. అణు విద్యుత్ కు ప్రయోగాలు..
రష్యాలో ప్లేగు వ్యాధి పై క్రెమ్లిన్ చెప్పిందిదే
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు

