Fauji: డార్లింగ్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. సాలిడ్ టీజర్ వస్తోంది!
ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’పై ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23న ‘వరల్డ్ ఆఫ్ ఫౌజీ’ పేరుతో ప్రత్యేక టీజర్ విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. ఇందులో సినిమా ప్రపంచంతో పాటు ప్రభాస్ పాత్ర లుక్‌ను పరిచయం చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం యాక్షన్ షెడ్యూల్ కొనసాగుతుండగా, నవంబర్ చివరి నాటికి షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు టాక్.
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ డ్రామా ‘ఫౌజీ’. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టాలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘వర్ల్డ్ ఆఫ్ ఫౌజీ’ అనే ప్రత్యేకమైన టీజర్ వీడియోను ఆ రోజే విడుదల చేసేందుకు చిత్రబృందం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో ద్వారా ఫౌజీ వరల్డ్, ప్రభాస్ క్యారెక్టర్ లుక్‌ను ఆవిష్కరించబోతున్నారని సమాచారం. ఈ సినిమా చిత్రీకరణ కూడా వేగంగా సాగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న భారీ యాక్షన్ షెడ్యూల్ అక్టోబర్ 20 వరకు కొనసాగనుంది. ఆ తర్వాత సుమారు 10 రోజుల పాటు టాకీ పార్ట్ షూట్ చేయబోతున్నారట. ప్రభాస్ పై ఒక ప్రత్యేకమైన మాస్ మోంటాజ్ సాంగ్‌ను కూడా షూట్ చేసేందుకు షెడ్యూల్ ప్లాన్ చేసారు. మేకింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదని భావిస్తున్న మేకర్స్, కొత్త ఫైట్ మాస్టర్ల నేతృత్వంలో ఒక ప్రధాన ఫైట్ సీక్వెన్స్‌ను రీషూట్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే, నవంబర్ చివరి నాటికి మొత్తం షూటింగ్‌ను పూర్తి చేసేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 3న రిలీజ్ చేయాలనీ భావించిన మేకర్స్ వాయిదా వేస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు. వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న గాసిప్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
The Paradise Collection: దిమ్మతిరిగే కలెక్షన్స్.. నాని కెరీర్‌లో ఫాస్టెస్ట్ రూ.100CR!
Avengers Endgame Encore: ఎండ్‌గేమ్ ఎన్‌కోర్ దెబ్బకు.. మన బాహుబలి రికార్డ్ గల్లంతు!
వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఇక టోల్ కోసం ఆగాల్సిన పనే లేదు!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. తగ్గనున్న కరెంట్ బిల్లు ఛార్జీలు
భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా
హైదరాబాద్ వాసులకు అలర్ట్..డిసెంబర్ నుంచి నీటి కష్టాలు తప్పవా?
చంద్రుడి పై నివాసాలు.. అణు విద్యుత్ కు ప్రయోగాలు..
రష్యాలో ప్లేగు వ్యాధి పై క్రెమ్లిన్ చెప్పిందిదే
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు

