బెంగళూరులో జరిగిన ఓ విచిత్ర సంఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది. ర్యాపిడో బుక్ చేసుకున్న యువతిని ఎక్కించుకోకుండానే ఓ రైడర్ దాదాపు 10 కిలోమీటర్లు ప్రయాణించాడు. హెల్మెట్ ఇచ్చి, ఓటీపీ తీసుకున్న తర్వాత, యువతి ఎక్కిందని భ్రమపడి, ఖాళీ సీటుతోనే దూసుకెళ్లిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.