AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రేజీగా కమల్‌ లైనప్‌... షూటింగ్‌ స్టేటసేంటి?

క్రేజీగా కమల్‌ లైనప్‌… షూటింగ్‌ స్టేటసేంటి?

Samatha J
|

Updated on: Sep 07, 2026 | 4:21 PM

Share

లోకనాయకుడు కమల్ హాసన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. థగ్ లైఫ్ తర్వాత పలు ప్రాజెక్టులు ప్రకటించినా, వాటి షూటింగ్ అప్డేట్స్‌పై స్పష్టత కొరవడింది. రజినీకాంత్‌తో మల్టీస్టారర్, అంబు అరివు దర్శకత్వంలో యాక్షన్ మూవీ వంటివి చర్చలో ఉన్నా, కల్కి 2 మినహా ఇతర చిత్రాల షూటింగ్ స్టేటస్‌పై అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

లోకనాయకుడు కమల్ హాసన్ అనూహ్యమైన వేగంతో వరుస సినిమాలను ప్రకటిస్తూ కుర్ర హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా దూసుకుపోతున్నారు. ఆయన ప్రాజెక్టుల జాబితా చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అయితే, ఈ సినిమాల షూటింగ్ అప్డేట్స్‌పై మాత్రం సరైన స్పష్టత కొరవడుతోంది.తన 234వ చిత్రంగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన థగ్ లైఫ్ సినిమా భారీ అంచనాలను అందుకున్నప్పటికీ, ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. ఆ తర్వాత కమల్ చేయబోయే ప్రాజెక్టుల విషయంలో గందరగోళం నెలకొంది. యాక్షన్ కొరియోగ్రాఫర్లుగా పేరున్న అంబు అరివు దర్శకత్వంలో తన 237వ యాక్షన్ చిత్రాన్ని ప్రకటించినా, దీని షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనేది సస్పెపెన్స్‌గానే ఉంది. అలాగే 235, 236 చిత్రాల గురించి ఎటువంటి సమాచారం లేదు.సూపర్ స్టార్ రజినీకాంత్‌తో కలిసి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఒక మల్టీస్టారర్ సినిమా అనౌన్స్ అయ్యింది. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు దిగ్గజాలు కలిసి నటించబోతున్నారనే వార్త దక్షిణాదిలో ప్రకంపనలు సృష్టించింది. కానీ, ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియదు.తన లైనప్‌లో ఉన్న అనేక చిత్రాలకు స్పష్టత లేకపోగా, కేవలం నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ మూవీ కల్కి 2 విషయంలో మాత్రమే కమల్ హాసన్ విలన్‌గా నటిస్తూ షూటింగ్ జరుగుతోందనే అప్డేట్ ఉంది. కమల్ హీరోగా నటించే మిగతా సినిమాల షూటింగ్ అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Follow Us