Ambati Rambabu: జైలుకెళ్లిన ఘటనపై టీవీ9 క్రాస్ ఫైర్‌లో మాజీ మంత్రి అంబటి కీలక వ్యాఖ్యలు
మాజీ మంత్రి అంబటి రాంబాబు జైలు నుంచి విడుదలయ్యాక టీవీ9 ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించారు. వైసీపీ ఓటమిపై బాధపడలేదని, మదనపడ్డానని తెలిపారు. జైలుకు వెళ్లడం కన్నా ముందు జరిగిన పరిణామాలు దారుణమన్నారు. తాను కావాలని ఎవరినీ దూషించలేదని, ఆ క్షణంలో నోరు జారి పశ్చాత్తాపం వ్యక్తం చేశానన్నారు. కులాల పేరుతో ఎప్పుడూ దూషించలేదని, తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని స్పష్టం చేశారు.
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, ఇతర కేసుల్ బెయిల్ పొంది ఇటీవల జైలు నుంచి బటయకు వచ్చిన మాజీ మంత్రి అంబటి రాంబాబు టీవీ9 క్రాస్ ఫైర్ ఇంటర్వ్యూ లో కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఓటమిపై బాధపడలేదుని, మదనపడ్డామని తెలిపారు. జైలుకు వెళ్లడంపై తనకు అస్సలు భయపడలేదని.. జైలుకు వెళ్లడానికి ముందు జరిగిన పరిణామాలు దారుణమని ఆయన చెప్పుకొచ్చారు. తాను కావాలని ఎవరినీ దూషించలేదని.. ఆ సందర్భం వేరని అన్నారు.
ఆ క్షణంలో నోరు జారానని.. ఆ తరువాత పశ్చాతాపం వ్యక్తం చేశానని తెలిపారు. ఏడు గంటలకుపైగా నా ఇల్లు, ఆఫీస్‌పై దాడి చేసి భయపెట్టారన్నారు. ఆ సమయంలో పోలీస్ అధికారులెవరూ స్పందించలేదు అంబటి తెలిపారు. గతంలో పట్టాభి చేసిన వ్యాఖ్యలకు తన వ్యాఖ్యలకు సంబంధం లేదని.. పట్టాభి ఇప్పటివరకు తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోలేదన్నారు. తాను కమ్మవారిని తిట్టినట్టు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారని.. తాను ఇప్పటివరకు ఎప్పుడూ కులాల పేరుతో దూషించలేదన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్‌నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్‌నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?

