తొక్కే కదా అని తీసి పారేయకండి..ఇలా వాడారంటే చంద్రకాంతి కంటే మెరిసే చర్మం..!
మీరు చెత్తగా అనుకుని పడేసే నారింజ తొక్కతో బోలెడన్నీ లాభాలు ఉన్నాయి. అందమైన చర్మానికి ఈ తొక్కలు ఎలాంటి మేలు చేస్తాయో తెలిస్తే.. చిన్న తొక్కకూడా పారవేసే పొరపాటు చేయరు. ఇది చర్మంపై మృతకణాలను తొలగించి మీ రంగును ప్రకాశవంతం చేస్తుంది. ఇంకా, నారింజ తొక్కలలోని యాంటీమైక్రోబయల్ లక్షణాలు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగిస్తాయి. మీకు గ్లోయింగ్ ఫేస్ ఇవ్వగల నారింజ తొక్క ఫేస్ మాస్క్‌లు, వాటిని ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం..

మనమందరం మన ఆరోగ్యాన్ని, చర్మాన్ని కాపాడుకోవడానికి నారింజ పండ్లను తింటాము. ఈ సిట్రస్ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి, చర్మానికి చాలా అవసరం. కానీ నారింజ తొక్క వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? అవును, మీరు చెత్తగా అనుకుని పడేసే నారింజ తొక్కతో బోలెడన్నీ లాభాలు ఉన్నాయి. అందమైన చర్మానికి ఈ తొక్కలు ఎలాంటి మేలు చేస్తాయో తెలిస్తే.. చిన్న తొక్కకూడా పారవేసే పొరపాటు చేయరు. మీకు గ్లోయింగ్ ఫేస్ ఇవ్వగల నారింజ తొక్క ఫేస్ మాస్క్‌లు, వాటిని ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం..
నారింజ తొక్కల పొడి, బియ్యం పిండి: ముఖం జిడ్డుగా ఉన్నవారు ఈ ఫేస్ మాస్క్ తయారుచేస్తే మంచి ఫలితం ఉంటుంది. దీనికోసం బియ్యం పిండిలో నారింజ తొక్కల పొడి, రోజ్ వాటర్ కలిపి పేస్ట్ చేసి ముఖానికి రాసుకోండి. 10 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకుంటే సరిపోతుంది.
నారింజ తొక్కల పొడి, పెరుగు: ఓ గిన్నెలో కొద్దిగా పెరుగు, నారింజ తొక్కల పొడి, తేనె కలిపి పేస్ట్ లాగా చేసుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది.
నారింజ తొక్కల పొడి, నిమ్మరసంతో: స్పూన్ శనగ పిండిలో అరస్పూన్ నారింజ తొక్కల పొడి, కొన్ని చుక్కల నిమ్మరసం, కొద్దిగా రోజ్ వాటర్ కలిపి పేస్ట్ లాగా చేసుకోండి. దీనిని ముఖానికి రాసుకుని 10 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది.
నారింజ తొక్కల పొడి, ముల్తానీ మట్టితో: ఓ గిన్నెలో ముల్తానీ మట్టి, చిటికెడు పసుపు, నారింజ తొక్కల పొడి, పాలు వేసి పేస్ట్ లాగా చేయండి. దీనిని ముఖానికి రాసుకుని కాసేపయ్యాక క్లీన్ చేసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది.
నారింజ తొక్కల పొడి, అలోవెరాతో :ఫేస్ ప్యాక్ చేసుకోవచ్చు.. దీనికోసం తాజా అలోవెరా జెల్‌లో కొద్దిగా నారింజ తొక్కల పొడితో పాటు నిమ్మరసం కలిపి మిశ్రమంగా చేసుకోండి. దీనిని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాలు ఉంచి చల్లటి నీటితో క్లీన్ చేసుకోండి. తద్వారా స్కిన్ గ్లో పెరుగుతుంది.
నారింజ తొక్కల పొడి, చక్కెరతో: కూడా అద్భుతంగా చేస్తుంది. స్పూన్ నారింజ తొక్కల పొడిలో అరస్పూన్ చక్కెర, కొన్ని చుక్కల నిమ్మరసం, రోజ్ వాటర్ కలిపి మందపాటి పేస్ట్ లాగా చేసుకోండి. దీనిని ముఖానికి రాసుకుని స్క్రబ్ చేయండి. 5 నిమిషాల తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకుంటే సరి.
నారింజ తొక్కల పొడి, శనగ పిండి: కొద్దిగా శనగ పిండిలో నారింజ తొక్కల పొడి, తేనె కలిపి పేస్ట్ లాగా చేసుకోండి. ఈ పేస్ట్‌ను ముఖానికి రాసుకుని కాసేపయ్యాక క్లీన్ చేసుకుంటే ముఖం తాజాగా, మృదువుగా మారుతుంది. కాంతివంతంగా కనిపిస్తుంది.
నారింజ తొక్కల పొడి, చందనం: దీని కోసం ముందుగా ఒక గిన్నెలో చందనం పొడి తీసుకుని అందులో నారింజ తొక్కల పొడి, కొన్ని చుక్కల రోజ్ వాటర్ కలిపి పేస్ట్ లాగా చేసుకోండి. దీనిని ముఖానికి రాసుకుని 10 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకుంటే ముఖంపై జిడ్డు తొలగిపోయి గ్లో పెరుగుతుంది.
నారింజ తొక్కల పొడి టోనర్ లాగా: నారింజ తొక్కల పొడిని టోనర్ లాగా కూడా ఉపయోగించొచ్చు. దీనికోసం వేడి నీటిలో నారింజ తొక్కల పొడి వేసి చల్లారనివ్వండి. దీనిని ఓ స్ప్రే బాటిల్‌లో తీసుకోండి. ముఖం క్లీ్న్ చేసుకున్నాక దీనిని స్ప్రే చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








