AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vivah Panchami 2025: ఈ రోజున పెళ్లిళ్లు నిషేధం..! ఇలా చేస్తే మీ దాంపత్య జీవితం వెలిగిపోతుందట..!!

రామాయణం ప్రకారం, జనక మహా రాజు ఈ తేదీన సీతారాముల కల్యాణం జరిపించాడని పురణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజున అత్యంత శుభప్రదమైన సమయంగా మారింది. మిథిలా ప్రాంతంలో వేలాది జంటలు ఈ రోజున ఆ సీతారాముల సాక్షిగా ఒక్కటవుతారు. అలాంటి వివాహాలు విభేదాలు లేకుండా ఉంటాయని ప్రజల విశ్వాసం. కానీ, ఈ మూహూర్తంపై చాలా మందిలో అనేక అపోహలు కూడా ఉన్నాయి..అవేంటంటే..

Vivah Panchami 2025: ఈ రోజున పెళ్లిళ్లు నిషేధం..! ఇలా చేస్తే మీ దాంపత్య జీవితం వెలిగిపోతుందట..!!
Vivah Panchami
Jyothi Gadda
|

Updated on: Nov 12, 2025 | 12:41 PM

Share

హిందూ మతంలో మార్గశిర మాసం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ నెలలోనే శ్రీ రాముడు, సీతాదేవి వివాహం జరిగింది. అందుకే ఈ నెల మరింత ప్రత్యేకమైనది. హిందూ క్యాలెండర్ ప్రకారం, మార్గశిర శుక్ల పక్షం ఐదవ రోజును వివాహ పంచమి అని పిలుస్తారు. ఈ పర్వదినాన అరటి చెట్టును పూజిస్తారు. దాంపత్య జీవితంలో సమస్యలతో ఇబ్బందులు పడుతున్నవారు ఈ వివాహ పంచమి రోజున అరటి చెట్టును పూజిస్తే వారి సమస్యలన్నీ దూరమవుతాయని పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వివాహ పంచమి ఎప్పుడు వచ్చింది..? ఈ పర్వదినాన ఎలాంటి వేడుకలు జరుపుకుంటారు..? అరటి చెట్టును పూజించటం వల్ల కలిగే ఫలితాలేంటో ఇక్కడ చూద్దాం…

2025 వివాహ పంచమి తేదీ, ముహూర్తం:

ఈ సంవత్సరం వివాహ పంచమి నవంబర్ 24న వచ్చింది. రాత్రి 9:22 గంటలకు ప్రారంభమై, నవంబర్ 25 రాత్రి 10:56 గంటలకు ముగుస్తుంది. పూజకు శుభ సమయం ఉదయం 7:07 నుండి మధ్యాహ్నం 12:27 వరకు ఉంటుంది. కానీ, ఆ రోజు అంతా శుభ సమయంగా పరిగణిస్తారు.. ఈ శుభ సమయం అంటే పంచాంగాన్ని సంప్రదించకుండా లేదా గ్రహాలు, నక్షత్రాల గురించి చింతించకుండా వివాహాలను జరుపుకోవచ్చు. ఈ రోజు ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటుంది. ఇది వివాహానికి శుభప్రదంగా పరిగణిస్తారు. రామాయణం ప్రకారం, జనక మహా రాజు ఈ తేదీన సీతారాముల కల్యాణం జరిపించాడని పురణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజున అత్యంత శుభప్రదమైన సమయంగా మారింది. మిథిలా ప్రాంతంలో వేలాది జంటలు ఈ రోజున ఆ సీతారాముల సాక్షిగా ఒక్కటవుతారు. అలాంటి వివాహాలు విభేదాలు లేకుండా ఉంటాయని ప్రజల విశ్వాసం.

ఇవి కూడా చదవండి

అపోహలు వ్యాప్తి చెందుతున్నాయి:

అయితే, ఈ మూహూర్తంపై చాలా మందిలో కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. వివాహ పంచమి వేళ రాముడు, సీతాదేవి ఈ రోజున వివాహం చేసుకోవడం కారణంగానే వారు విడిపోయారని, సీతాదేవి అగ్నిపరీక్షను ఎదుర్కొవాల్సి వచ్చిందని చాలా మంది జ్యోతిష్కులు, ప్రజలు కూడా నమ్ముతారు. ఈ కారణంగానే వివాహ పంచమి పెళ్లికి నిషేధంగా భావిస్తారు. కానీ, ఇది నిజం కాదని ఈ రోజున వివాహం రెట్టింపు శుభప్రదంగా ఉంటుందని మరికొందరు విశ్వసిస్తున్నారు. ఈ రోజున వివాహం సురక్షితమైన, భద్రమైన వివాహా బంధానికి హామీ ఇస్తుందని అంటున్నారు.

కానీ, చాలా మంది ఈ రోజున పెళ్లిళ్లకు బదులుగా కొన్ని ప్రత్యేక పూజలు, వ్రతలు, సీతాదేవి పూజలు నిర్వహిస్తారు. వివాహ పంచమి రోజున తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందు నిద్ర లేచి తలస్నానం చేసుకుని పసుపు బట్టలు ధరించి అరటి చెట్టుకు పసుపు తాడు కట్టి పూజించాలని, అక్కడే పువ్వులు, చందనం సమర్పించి నేతి దీపం వెలిగించాలని పండితులు చెబుతున్నారు. అరటి చెట్టును పూజించే సమయంలో శ్రీరాముని మంత్రాలను, విష్ణు మంత్రాలను పఠించాలని చెబుతున్నారు. పూజ తర్వాత నైవేద్యంగా సమర్పించాలి. వివాహ పంచమి రోజున అరటి చెట్టు చుట్టూ 21 సార్లు ప్రదక్షిణలు చేసి, అవివాహితులు మంచి సంబంధం రావాలని, పెళ్లైన వారు తమ దాంపత్య జీవితం సాఫీగా సాగాలని కోరుకుంటే వారి కోర్కెలు నెరవేరుతాయని నమ్ముతారు. .

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..