AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lavanya Tripathi: నేనూ క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే.. ఆ డైరెక్టర్ అలా ప్రవర్తించడంతో: లావణ్య త్రిపాఠి

తానూ క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినేనంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది మెగా కోడలు లావణ్య త్రిపాఠి. ఒక ప్రముఖ డైరెక్టర్ తీరు నచ్చకపోవడంతో సినిమాను రిజెక్ట్ చేశానని, కానీ నాపైనే తప్పుడు ప్రచారం చేశారని లావణ్య వాపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

Lavanya Tripathi: నేనూ క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే.. ఆ డైరెక్టర్ అలా ప్రవర్తించడంతో: లావణ్య త్రిపాఠి
Lavanya Tripathi
Basha Shek
|

Updated on: Mar 15, 2026 | 6:44 AM

Share

మెగా కోడలు, వరుణ్ తేజ్ సతీమణి లావణ్య త్రిపాఠి షాకింగ్ కామెంట్స్ చేసింది. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది అమ్మాయిల్లాగే తాను కూడా క్యాస్టింగ్ కౌచ్‌ బారిన పడినట్లు వెల్లడించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన లావణ్య త్రిపాఠి తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇదే క్రమంలో సినిమా ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను షేర్ చేసుకుంది. ‘ కరోనా సమయంలో నేను ఒక తమిళ సినిమా చేయాల్సి వచ్చింది. కానీ ఆ దర్శకుడి తీరు నాకు కరెక్ట్ అనిపించలేదు. నాకు అక్కడ సౌకర్యంగా లేదని అనిపించింది. అందుకే ఆ సినిమాకు నో అని చెప్పా. ఆ తర్వాత వారు నా గురించి వార్తాపత్రికల్లో తప్పుడు కథనాలను ప్రచురించడం మొదలుపెట్టారు. ఆ సమయంలో నాకు ఎవరూ కూడా సపోర్టు చేయలేదు. పైగా రివర్స్ లో నన్ను టార్గెట్ చేసి వేధించారు. నాపై కేసు కూడా పెట్టారు. పత్రికల్లో తప్పుడు కతనాలు రాసుకొచ్చారు. ఆ సమయంలో ఏం చేయాలో తెలియాక ఏడ్చేశాను’ అని తన బ్యాడ్ ఎక్స్ పీరియెన్స్ ను షేర్ చేసుకుంది లావణ్య.

ప్రస్తుతం మెగా కోడలు చేసిన ఈ క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఆ డైరెక్టర్ పేరును వెల్లడించలేదు లావణ్య. ఇక సినిమాల విషయానికి వస్తే.. పెళ్లి తర్వాత లావ‌ణ్య త్రిపాఠి నటిస్తోన్న మొదటి సనిమా ‘సతీ లీలావతి’. తాతినేని స‌త్య తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో లావణ్యకు జోడీగా దేవ్ మోహన్ నటిస్తున్నాడు. ప్రఖ్యాత‌ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యానర్‌పై నాగ‌మోహ‌న్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెలలోనే విడుదల కావాల్సి ఉంది. అయితే అనూహ్యంగా వాయిదా పడింది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

లావణ్య కామెంట్స్.. వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us