LPG Crisis Live Updates: యుద్ధంతో వంటగ్యాస్ కష్టాలు.. హర్మూజ్ జలసంధిని దాటిన మరో 2 నౌకలు..
US Israel Iran war effect on LPG Gas Cylinder : ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంతో భారత్‌లో వంటగ్యాస్ కష్టాలు నెలకొన్నాయి.. దేశవ్యాప్తంగా చాలా నగరాలు, పట్టణాల్లో వంటగ్యాస్ సిలిండర్లు రోడ్లమీదకు వచ్చాయి. ఖాళీ గ్యాస్ బండలు క్యూ కట్టాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా గ్యాస్ కొరత అనేక రంగాలను ప్రభావితం చేస్తోంది. కేవలం, గ్యాస్‌పైనే ఆధారపడిన రంగాల కష్టాలైతే మరింత దుర్భరంగా మారుతున్నాయి.

LIVE NEWS & UPDATES
-
గ్యాస్ కొరత.. కేంద్రం ప్రత్యేక కమిటీ
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల క్రమబద్దీకరణపై కేంద్రం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. గృహ వినియోదారులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతానికి ప్రాధాన్యతాక్రమంలో గ్యాస్ సరఫరాకు ఆదేశాలు జారీ చేశారు. ఇతర దేశాల నుంచి LPG, LNG కార్గోల ద్వారా గ్యాస్ సేకరించాలని నిర్ణయించారు. నౌకల నిలిపివేతతో నిన్నటికి దేశంలో 40 భారీ క్రూడ్ క్యారియర్ల కొరత ఏర్పడింది. సాధ్యమైనంత త్వరలో పరిస్థితిని చక్కదిద్దేందుకు మోదీ ఆదేశాలు జారీ చేశారు.
-
గ్యాస్ సిలిండర్లను కూడా కాపాడుకోవాల్సిందే బాసూ..
దేశంలో గ్యాస్ దొంగలు పడ్డారు. ఇంటికి తాళం వేసి ఉన్నా.. ఇంట్లో ఎవరు లేకపోయినా అదును చూసి ఎల్‌పీజీ సిలిండర్లను ఇట్టే లేపేస్తున్నారు. ఒక్క సిలిండరైనా.. వందలాది సిలిండర్లకయినా సరైన సెక్యూరిటీ లేకపోతే ఇట్టే మాయమైపోతున్నాయ్. ఉల్లిపాయలు, టమోటాలు ధరలు పెరిగినప్పుడు వాటిని ఎలా బంగారంలా కాపాడుకుంటామో ఇప్పుడు వంటగ్యాస్ సిలిండర్లను కూడా కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిందేనా?
-
-
హర్మూజ్ జలసంధి నుంచి భారత్‌కు మరో రెండు నౌకలు
హర్మూజ్ జలసంధిలోని భారత్‌కు చెందిన LPG నౌకలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే.. ఓ నౌక భారత్‌కు చేరుకోగా.. ఇప్పుడు మరో రెండు LPG నౌకలు కూడా ఒకట్రెండు రోజుల్లో గుజరాత్‌కు రాబోతున్నట్లు కేంద్రం వెల్లడించింది. గ్యాస్‌ను వివిధ మార్గాల్లో భారత్‌కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు స్ఫష్టం చేసింది
-
వంటగ్యాస్ కష్టాల వేళ ప్రభుత్వం కీలక ప్రకటన
దేశవ్యాప్తంగా వంటగ్యాస్ కష్టాల వేళ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
దేశంలో ఇంధన కొరత లేదన్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
గ్యాస్ సరఫరాలో ఇబ్బందుల్లేవని.. ఈ పరిణామాలను కేంద్రప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని.. గోయల్ తెలిపారు.
US Israel Iran war effect on LPG Gas Cylinder : ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంతో భారత్‌లో వంటగ్యాస్ కష్టాలు నెలకొన్నాయి.. దేశవ్యాప్తంగా చాలా నగరాలు, పట్టణాల్లో వంటగ్యాస్ సిలిండర్లు రోడ్లమీదకు వచ్చాయి. ఖాళీ గ్యాస్ బండలు క్యూ కట్టాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా గ్యాస్ కొరత అనేక రంగాలను ప్రభావితం చేస్తోంది. కేవలం, గ్యాస్‌పైనే ఆధారపడిన రంగాల కష్టాలైతే మరింత దుర్భరంగా మారుతున్నాయి. ముఖ్యంగా.. కమర్షియల్ గ్యాస్ ఉపయోగించే హోటళ్లు-రెస్టారెంట్లు, LPG, CNG ఆటోవాలాల పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. గ్యాస్ కష్టాలు లేవని, అందరికీ గ్యాస్ అందుతుందని కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తున్నా.. చాలా మంది.. ఖాళీ బండలతో రోడ్లెక్కుతున్నారు. హర్మూజ్ జలసంధిలోని భారత్‌కు చెందిన LPG నౌకలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే.. ఓ నౌక భారత్‌కు చేరుకోగా.. ఇప్పుడు మరో రెండు LPG నౌకలు కూడా ఒకట్రెండు రోజుల్లో గుజరాత్‌కు రాబోతున్నట్లు వెల్లడించింది. హర్మూజ్ జలసంధికి ఇరువైపులా వందలాది నౌకలు చిక్కుకుపోగా.. ఈ మార్గంలో భారత నౌకలు వెళ్లేందుకు అనుమతిస్తామని ఇటీవల ఇరాన్ ప్రకటించింది. దీనికి తగ్గట్లే.. రెండు భారత జెండాలు ఉన్న ఎల్పీజీ నౌకలు నిన్న ఉదయం సురక్షితంగా హర్మూజ్ జలసంధిని దాటాయని కేంద్రం తెలిపింది. ‘శివాలిక్’, ‘నందాదేవి’ పేరు గల నౌకలు గుజరాత్‌లోని ముంద్రా, కాండ్లా పోర్టుల వైపు వస్తున్నాయని షిప్పింగ్ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ నౌకల్లో సుమారు 92 వేల టన్నుల ఎల్పీజీ ఉందని, రెండు రోజుల్లో భారత్‌కు చేరుకునే అవకాశం ఉందని చెప్పింది. దేశంలో ఎల్పీజీ సరఫరాపై ఆందోళన వ్యక్తమవుతోన్న సమయంలో తాజా పరిణామం ఊరట కలిగిస్తోంది.
ఆందోళన వద్దు..
మరోవైపు.. గృహ వినియోగ సిలిండర్ల విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని కేంద్రం విజ్ఞప్తి చేసింది. అయితే.. అవసరం లేకున్నా చాలామంది బుకింగ్ చేయడంతోనే ఆందోళన వ్యక్తమవుతోంది. బ్లాక్‌మార్కెట్‌ను అరికట్టాలని రాష్ట్రాలను కోరడంతో పాటు.. ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని పేర్కొంది. గల్ఫ్‌లో ఉన్న భారతీయ నౌకలు క్షేమంగానే ఉన్నాయని, వాటిలో ఉన్న భారత సిబ్బందికి ఎలాంటి సమస్యలు లేవని కేంద్రం పేర్కొంది. హర్మూజ్ జలసంధిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపింది. భారత నావికుల కుటుంబసభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నామని వెల్లడించింది
Published On - Mar 15,2026 7:09 AM




