AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మురిపించిన లేగ దూడలు.. అమలాపురంలో సందడిగా ఆవు దూడల అందాల పోటీలు!

అమలాపురం రూరల్ మండలం సాకుర్రులో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన లేగ దూడల అందాల పోటీలు స్థానికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సాధారణంగా అందాల పోటీలు అంటే యువతులు పాల్గొనే ఫ్యాషన్ షోలు గుర్తుకు వస్తాయి. కానీ, ఇక్కడ ఆవు దూడలకు పోటీలు నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పుంగనూరు, జెర్సీ, కపిల, దేశావళీ వంటి రకాలకు చెందిన లేగ దూడలను రైతులు అందంగా అలంకరించి ఈ పోటీల్లో ప్రదర్శించారు. ముఖ్యఅతిథిగా హాజరైన అమలాపురం ఎమ్మెల్యే అయితబత్తుల ఆనందరావు విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

మురిపించిన లేగ దూడలు.. అమలాపురంలో సందడిగా ఆవు దూడల అందాల పోటీలు!
Amalapuram Calf Beauty Contest
Pvv Satyanarayana
| Edited By: |

Updated on: Mar 15, 2026 | 7:11 AM

Share

అమలాపురం (కోనసీమ జిల్లా): పచ్చని కోనసీమలో పశువులకు, పాడి రైతులకు ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. తాజాగా అమలాపురం రూరల్ మండలం సాకుర్రు గ్రామంలో నిర్వహించిన లేగ దూడల అందాల పోటీలు ఈ విషయాన్ని మరోసారి నిరూపించాయి. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ వినూత్న కార్యక్రమం చూపరులను మంత్రముగ్ధులను చేసింది. ఈ అందాల పోటీల్లో పాల్గొనేందుకు మండలంలోని వివిధ గ్రామాల నుండి రైతులు తమ లేగ దూడలను తీసుకువచ్చారు. పుంగనూరు, జెర్సీ, కపిల, దేశావళీ వంటి మేలు రకపు జాతులకు చెందిన దూడలను పూలమాలలు, రంగురంగుల వస్త్రాలతో అందంగా అలంకరించారు. ముద్దుగా, చురుగ్గా కదులుతున్న ఆ లేగ దూడలను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ఎమ్మెల్యే ఆనందరావు పిలుపు: కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న అమలాపురం ఎమ్మెల్యే అయితబత్తుల ఆనందరావు విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి కాలంలో కల్తీ పాలు ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఇంట్లో ఒక గోవును పెంచుకోవడం ద్వారా స్వచ్ఛమైన పాలు తాగి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పాడి రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ప్రతి రైతు వినియోగించుకోవాలని కోరారు.

బిడ్డల్లా సాకుతున్న రైతులు: మేము ఈ ఆవులను కేవలం పశువుల్లా చూడటం లేదు, మా ఇంట్లో పిల్లల వలె సాకుతున్నాం. వాటికి సమయానికి ఆహారం ఇస్తూ, ఎంతో ప్రేమగా పెంచుకుంటాం అని రైతులు ఆనందంగా తెలిపారు. తమ దూడలు అందాల పోటీల్లో గెలవడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. కాలేజీ ఫ్యాషన్ షోలను తలపించేలా సాగిన ఈ డమ్స్ సెషన్ గ్రామీణ వాతావరణంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. పాడి పరిశ్రమను ప్రోత్సహించడానికి ఇటువంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయని అధికారులు అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మురిపించిన లేగ దూడలు.. అమలాపురంలో సందడిగా ఆవు దూడల అందాల పోటీలు!
మురిపించిన లేగ దూడలు.. అమలాపురంలో సందడిగా ఆవు దూడల అందాల పోటీలు!
కొత్తిమీరే కదా అని తీసిపారేస్తున్నారా.. అది చేసే అద్భుతం తెలిస్తే
కొత్తిమీరే కదా అని తీసిపారేస్తున్నారా.. అది చేసే అద్భుతం తెలిస్తే
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంతో భారత్‌లో వంటగ్యాస్‌ కష్టాలు
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంతో భారత్‌లో వంటగ్యాస్‌ కష్టాలు
రికార్డ్ స్థాయికి చికెన్ ధరలు.. నాన్ వెజ్ తినేవారికి బ్యాడ్ న్యూస
రికార్డ్ స్థాయికి చికెన్ ధరలు.. నాన్ వెజ్ తినేవారికి బ్యాడ్ న్యూస
మరో కీలక అప్డేట్‌ వచ్చేసింది!
మరో కీలక అప్డేట్‌ వచ్చేసింది!
పేరెంట్స్‌కు ఐశ్వర్య రాయ్ చెబుతున్న ‘సక్సెస్ మంత్ర’
పేరెంట్స్‌కు ఐశ్వర్య రాయ్ చెబుతున్న ‘సక్సెస్ మంత్ర’
నాట్యం చేస్తున్న గ్రహాలు.. ఉగాది నుంచి వారికి ఏడుపు షురూ..
నాట్యం చేస్తున్న గ్రహాలు.. ఉగాది నుంచి వారికి ఏడుపు షురూ..
'నేనూ క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే.. ఏం చేయాలో తెలియక ఏడ్చేశా'
'నేనూ క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే.. ఏం చేయాలో తెలియక ఏడ్చేశా'
కలలో బల్లి కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా..?
కలలో బల్లి కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా..?
పసిడి ప్రియులకు చల్లని వార్త.. స్థిరంగా బంగారం, వెండి ధరలు..
పసిడి ప్రియులకు చల్లని వార్త.. స్థిరంగా బంగారం, వెండి ధరలు..