AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken Prices: చికెన్ తినేవారికి పిడుగులాంటి వార్త.. ఒక్కసారిగా పెరిగిన చికెన్ ధరలు.. ఇప్పుడు కేజీ ఎంతంటే..?

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు పెరిగాయి. గత నాలుగు రోజులుగా ధరలు పెరుగుతూనే వస్తోన్నాయి. వారం రోజుల క్రితం రూ.300గా ఉండగా.. ఇప్పుడు రికార్డ్ స్థాయికి పెరుగుతున్నాయి. ఇక నాటుకోడి చికెన్ అయితే రికార్డ్ సృష్టిస్తోంది. ప్రస్తుతం చికెన్ ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

Chicken Prices: చికెన్ తినేవారికి పిడుగులాంటి వార్త.. ఒక్కసారిగా పెరిగిన చికెన్ ధరలు.. ఇప్పుడు కేజీ ఎంతంటే..?
Broiler Chickens
Venkatrao Lella
|

Updated on: Mar 15, 2026 | 7:07 AM

Share

నాన్ వెజ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్ అందింది. చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. మొన్నటివరకు రూ.300 వరకు పలికిన కిలో చికెన్ ధర.. కొద్ది రోజుల్లోనే ఆమాంతం పెరిగింది. వేసవికాలం వచ్చేయడంతో ఎండ ప్రభావంతో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. దీంతో పాటు ఉత్పత్తి తగ్గడంతో ధరలు పెరుగుతున్నట్లు పాల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మరికొన్ని రోజుల పాటు ధరలు పెరిగే అవకాశముందని, మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ప్రతీసారి ఎండాకాలంలో చికెన్ ధరలు సాధారణంగా పెరుగుతూ ఉంటాయి. ఈ సారి కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. దీంతో సామాన్యులపై భారం పడుతోంది.

కిలో చికెన్ ఎంతంటే..?

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో కేజీ స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.325కి చేరుకుంది. ఇక డ్రస్‌డ్ చికెన్ రూ.286గా ఉండగా.. రిటైల్ లైవ్ బర్డ్ రూ.197గా ఉంది. ఇక ఫారంలో లైవ్ బర్డ్ రూ.170గా కొనసాగుతోంది. ఇక విజయవాడలో కిలో స్కిన్‌లెస్ చికెన్ రూ.317గా ఉండగా.. డ్రస్స్‌డ్ చికెన్ రూ.278, రిలైల్ లైవ్ బర్డ్ రూ.192, ఫారం దగ్గర లైవ్ బర్డ్ రూ.165గా ఉంది. అటు కరీంనగర్‌లో కిలో స్కిన్‌లెస్ చికెన్ రూ.325గా కొనసాగుతోంది. అటు కోడి గుడ్ల ధరలు కాస్త తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో 12 గుడ్ల రిటైల్ ధర రూ.64గా కొనసాగుతోంది. గత వారంలో తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు రూ.300గా ఉన్నాయి. కానీ ఇప్పుడు రూ.25 మేర పెరగడంతో నాన్ వెజ్ ప్రియులు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. అయినా చికెన్ తినేవారు మాత్రం వెనకడుగు వేయడం లేదు.

నాటు కోడి రికార్డ్ స్థాయికి..

ఇక నాటుకోడి ధర రికార్డ్ స్థాయికి చేరుకుంది. కిలో నాటుకోడి రూ.750 నుంచి రూ.800 వరకు పలుకుతోంది. రంజాన్ పండుగ కావడంతో కోళ్లకు డిమాండ్ పెరిగింది. దీంతో పాటు సమ్మర్‌లో ఎండ ప్రభావానికి కోళ్లు చనిపోతున్నాయి. ఈ క్రమంలో డిమాండ్‌కు తగ్గట్లు ఉత్పత్తి లేకపోవడంతో ధరలు పెరిగినట్లు పాల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. నాలుగు రోజులుగా చికెన్ రేట్లల్లో పెరుగుదల నమోదవుతోంది. త్వరలో చికెన్ రూ.350కి కూడా చేరుకునే అవకాశముందని అంచనాలు వెలువడుతున్నాయి. సంక్రాంతి సమయంలో బాయిలర్ కోడి చికెన్ ధరలు రూ.350కి చేరుకోగా.. ఆ తర్వాత ఫిబ్రవరిలో రూ.270కి చేరుకున్నాయి. ప్రస్తుతం మళ్లీ రూ.350కి త్వరలో చేరుకోనున్నాయి. రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణశాఖ చెబుతోంది. దీంతో ఫామ్స్‌లో కోళ్లు చనిపోయే అవకాశముందని, దీని వల్ల యజమానులు నష్టపోతున్నారని వ్యాపారులు చెబుతున్నారు.

Follow Us