తెల్ల ఉల్లిని తేలికగా తీసుకోవద్దండోయ్.. ఇందులోని ఆరోగ్య రహస్యాలు తెలిస్తే..
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదనే నానుడి. అందుకు తగినట్టుగానే ఇందులోని గొప్ప గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బయాటిక్ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. వీటిని తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అయితే, ఉల్లిపాయల్లో రెడు రకాలు ఉంటాయి. తెల్ల ఉల్లి, ఎర్ర ఉల్లి అనేవి. వీటిలో తెల్ల ఉల్లి ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..

తెల్ల ఉల్లిపాయ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీనిలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో జలుబు, ఫ్లూ వంటి అంటువ్యాధులకు వ్యతిరేకంగా పోరాడటంలో సహాయపడుతుంది. తెల్ల ఉల్లిపాయలలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతున్నవారికి మంచి సమస్య నుంచి మంచి ఉపశమనం కలిగిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. తెల్ల ఉల్లిపాయలలోని క్రోమియం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. తెల్ల ఉల్లిపాయల్లో ఉండే క్రోమియం, సల్ఫర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. డయాబెటిక్ లేదా ప్రీ-డయాబెటిక్ రోగులకు మితంగా వాడితే చాలా మంచిది.
తెల్ల ఉల్లిపాయలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ మంచి మూలం. తెల్ల ఉల్లిపాయలు యాంటీఆక్సిడెంట్లలో కూడా సమృద్ధిగా ఉన్నాయి. ఎన్నో పోషక విలువలు కలిగివున్న ఉల్లిపాయ విటమిన్లు C, B6, ఫోలేట్, పొటాషియం మంచి మూలం. ఇందులోని గుణాలు కణాలను దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడతాయి. ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, క్వెర్సెటిన్ వంటి మొక్కల సమ్మేళనాలను ఉల్లిపాయలో సమృద్ధిగా ఉంటాయి. తెల్ల ఉల్లిపాయలతో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
తెల్ల ఉల్లిపాయలలోని క్వెర్సెటిన్ అనే ఫ్లేవనాయిడ్ రక్తపోటును తగ్గించడంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. తెల్ల ఉల్లిపాయలలోని యాంటీఆక్సిడెంట్లు కణాలను దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడతాయి, ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. జుట్టుకు చాలా మేలు చేస్తుంది తెల్ల ఉల్లిపాయ రసం, జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాకుండా, చుండ్రు, జుట్టు అకాల నెరసిపోవడాన్ని నివారిస్తుంది. జుట్టును మెరిసేలా చేస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








