AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉదయాన్నే కాఫీ తాగే అలవాటు మీకూ ఉందా? ఐతే మీరీ విషయం తెలుసుకోవాల్సిందే..

చాలా మంది ఓ కప్పు కాఫీతో తమ రోజును ప్రారంభిస్తారు. ఈ అలవాటు రోజంతా ఉత్సాహంగా ఉండటానికి సహాయపడుతుంది. అన్ని రకాల కాఫీలలో, బ్లాక్ కాఫీ ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కెఫిన్‌తో పాటు, ఆరోగ్యానికి మంచిదని భావించే అనేక పదార్థాలు ఇందులో ఉన్నాయి. కొందరు ఉదయం కాఫీ తాగడం మంచిది అంటుంటారు. కానీ పాలు కలపకుండా తయారుచేసిన బ్లాక్ కాఫీ తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ముఖ్యంగా ఉదయం పూట ఈ అలవాటు నిజంగా ప్రయోజనకరంగా ఉంటుంది...

ఉదయాన్నే కాఫీ తాగే అలవాటు మీకూ ఉందా? ఐతే మీరీ విషయం తెలుసుకోవాల్సిందే..
Black Coffee In Morning
Srilakshmi C
|

Updated on: Nov 16, 2025 | 1:47 PM

Share

ఉదయం పూట బ్లాక్ కాఫీ తాగడం వల్ల లివర్ ఫ్యాట్ తగ్గి, లివర్ పనితీరు మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతేకాదు మీరూ ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించాలనుకుంటే, ప్రతిరోజూ బ్లాక్ కాఫీ తాగడం ప్రారంభించవచ్చు. కానీ ఇది అందరికీ మంచిది కాదు. బ్లాక్ కాఫీ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతే కాదు మీరు తినే ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. కానీ మీకు జీర్ణ సమస్యలు ఉంటే మాత్రం కాఫీ తాగడం అంత మంచిది కాదు. ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగడం వల్ల కొవ్వును కరిగించడమే కాకుండా కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు ప్రతిరోజూ ఉదయం బ్లాక్ కాఫీ తాగాలి. బ్లాక్ కాఫీ శరీర జీవక్రియను కూడా సక్రియం చేస్తుంది. తద్వారా కేలరీల ఖర్చు పెరుగుతుంది. సులభంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అందుకే ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగడం బరువు తగ్గడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

బ్లాక్ కాఫీ తాగడం వల్ల నాడీ వ్యవస్థ ఉత్తేజితమవుతుంది. ఇది శరీరంలో శక్తి స్థాయిలను పెంచడమే కాకుండా, రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. ప్రతిరోజూ పరిమిత పరిమాణంలో బ్లాక్ కాఫీ తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు కూడా దరికి రావు. అంతే కాదు గుండె నాళాలలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుంది. బ్లాక్ కాఫీలో అధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మ సంబంధిత సమస్యలను నివారిస్తుంది.

బ్లాక్ కాఫీ తాగడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఇది రోజును ఉత్సాహంగా ప్రారంభించడానికి సహకరిస్తుంది. చిరాకు, ఆందోళన వంటి సమస్యలు దరికి చేరవు. బ్లాక్ కాఫీ కాలేయ పనితీరును పెంచుతుంది. ఇది ఫ్యాటీ లివర్ వంటి సమస్యల నుంచి రక్షించి, ఆరోగ్యంగా ఉంచుతుంది. ఉదయం వేళల్లో బ్లాక్ కాఫీ తాగడం వల్ల మెదడు పనితీరు మరింత మెరుగుపడుతుంది. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. చిత్తవైకల్యాన్ని నివారించడానికి కూడా సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.