గుండె సమస్యలు ఉన్నవారు అరటి పండ్లు తినొచ్చా?

19 March 2026

TV9 Telugu

TV9 Telugu

ఆధునిక జీవనశైలి కారణంగా చాలామంది నడివయసుకు చేరుకునే సరికే అధిక రక్తపోటు (బీపీ) బారినపడుతున్నారు. అయితే అరటి, యాపిల్‌ పండ్లు తినేవారిలో ఏ కారణంతోనైనా మరణించే ముప్పు దాదాపు 40 శాతం తక్కువని తాజా అధ్యయనంలో తేలింది

TV9 Telugu

వారంలో మూడు నుంచి ఆరుసార్లు అరటి, యాపిల్‌ తింటే మంచిదని ఈ అధ్యయనంలో వెల్లడైంది. అరటిపండ్లలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది

TV9 Telugu

కాబట్టి అరటితో బీపీ నియంత్రణకు దోహదపడుతుండ వచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. కానీ పియర్స్‌, ద్రాక్ష, పైనాపిల్‌ పండ్ల నుంచి మాత్రం ఇలాంటి ప్రయోజనాలు ఆశించలేమని పరిశోధకులు తెలిపారు

TV9 Telugu

స‌మ‌తుల్యమైన పోష‌కాలు క‌లిగిన ఆహారాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డ‌డంతో పాటు గుండె సంబంధిత స‌మ‌స్యల బారిన ప‌డ‌కుండా మ‌న‌ల్ని మ‌నం కాపాడుకోవ‌చ్చు

TV9 Telugu

ముఖ్యంగా అర‌టి పండును తీసుకోవ‌డం వ‌ల్ల గుండెకు ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. అరటిపండు మ‌న‌కు అన్ని వేళ‌లా త‌క్కువ ధ‌ర‌లో ల‌భిస్తుంది

TV9 Telugu

అలాగే అర‌టిపండు తియ్యగా చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా దీనిని ఇష్టంగా తింటారు. అర‌టిపండ్లను తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది

TV9 Telugu

అరటిపండులో పొటాషియం ఎక్కువ‌గా సోడియం త‌క్కువ‌గా ఉంటుంది. దీనిని తిన‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డ‌డంతో పాటు ప్రాణాంత‌క వ్యాధుల బారిన ప‌డకుండా ఉంటాం

TV9 Telugu

అంతేకాకుండా అర‌టిపండును తీసుకోవ‌డం వ‌ల్ల దీనిలో ఉండే పొటాషియం ర‌క్తపోటును అదుపులో ఉంచ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. కాబట్టి రోజుకో అరటి పండు ఇవాళ్టి నుంచే ప్రారంభించండి