చలికాలంలో చర్మ రక్షణ కోసం పాటించాల్సిన టిప్స్ ఇవే!
చలికాలం చాలా హాయిగా ఉంటుంది. ఈ సమయలో చాలా మంది ఎక్కువగా విహారయాత్రలు వెళ్లడానికి ఇష్టపడుతుంటారు. కానీ ఈ సీజన్ చర్మం చాలా బిగుతుగా, పొడిగా మారిపోవడంతో, చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. చలి నుంచి తమను కాపాడుకోవడానికి ఎక్కువగా టీ, కాఫీలు తాగడం, స్వెటర్స్ ధరించడం చేస్తుంటారు. కానీ ఇలా చేయడం సరిపోదంట.చలికాలంలో మీ చర్మాన్ని రక్షించుకోవాలంటే తప్పకుండా కొన్ని టిప్స్ పాటించాలంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.
Updated on: Nov 17, 2025 | 12:30 PM

చలికాలంలో చర్మం జిడ్డుగా మారిపోతుంటుంది. అందువలన క్రీమ్స్ వాడకుండా, ఇంటిలోనే తేనె, కలబంద లేదా రోజ్ వాటర్ వంటి పదార్థాలు ఉపయోగించి పౌడర్ తయారు చేసుకొని, దానిని చర్మానికి అప్లై చేసుకోవాలంట. దీని వలన మీ చర్మం సున్నితంగా ఉంటుంది. ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉండవంట. ఇవి త్వరగా చర్మం పై ఉన్న మురికిని తెలిగిస్తాయి.

శీతాకాలంలో చాలా మంది ఎక్కువగా వేడి నీటితో స్నానం చేస్తుంటారు. కానీ ఇది అస్సలే మంచిది కాదంట. చాలా వేడిగా ఉండే నీటితో స్నానం చేయడం వలన ఇది చర్మాన్ని పొడిబారేలా చేయడ మే కాకుండా, చర్మ సమస్యలకు కారణం అవుతుందంట. అందుకే చలికాలంలో ఎక్కువవేడి నీటితో స్నానం చేయకూడదు, అలాగే చాలా సేపు వేడి నీటితో స్నానం చేయకూడదు అని చెబుతున్నారు నిపుణులు. ఇక స్నానం చేసిన తర్వాత తప్పకుండా చర్మ రక్షణ కోసం, మాయిశ్చరైజర్స్ ఉపయోగించాలంట.

చలికాలంలో క్రీమ్స్ ఉపయోగిస్తే సరిపోదు, మీ చర్మాన్ని కాపాడుకో వాలంటే, వెచ్చదానాన్ని ఇచ్చే ఆహార పదార్థాలు తినడం వలన చర్మమే కాకుండా ఆరోగ్యం కూడా బాగుంటుందంట. తప్ప కుండా శీతాకాలంలో క్యారెట్, ఉసిరి, నారింజ, జామ పండ్లు, ఆకు కూరలు తినడం చాలా మంచిదంట. ఇందులో ఉండే విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ మీ చర్మాన్ని లోపలి నుంచి కాపాడటమే కాకుండా ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే బాదం వాల్ నట్స్ , చియా గిజలు డైట్‌లో చేర్చుకోవడం వలన కూడా మీ చర్మాన్ని కాంతి వంతంగా తయారు చేస్తాయంట.

శీతాకాలంలో ఎక్కువగా పెదవులు పలకడం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అందువలన ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే, తప్పకుండా శీతాకాలంలో నెయ్యి,చక్కెర తో లిప్ స్క్రబ్ తయారు చేసుకొని, రాత్రి సమయంలో ఉపయోగించడం వలన పెదాలు అందంగా, ఉంటాయంట.