- Telugu News Photo Gallery Spiritual photos Vastu Tips: These are the reasons why you donot have money in your pocket
వాస్తు టిప్స్ : మీ జేబులో డబ్బు ఉండటం లేదా.. కారణాలు ఇవేనేమో!
జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి ఉన్న ప్రత్యేక ప్రాముఖ్యతే వేరు. ఎవరైతే వాస్తు నియమాలు సరిగ్గా పాటిస్తారో వారి ఇంట ఆర్థిక సమస్యలు ఉండవు, కానీ వాస్తు నియమాలు ఉల్లంఘించిన వారు అప్పలతో సతమతం అవుతారంట. ముఖ్యంగా కొంత మంది జేబులో ఎంత సంపాదించినా డబ్బు ఉండదు. దానికి కారణాలు ఇవే అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.
Updated on: Nov 17, 2025 | 1:30 PM

వాస్తు అనేది ఇక ఇంటిపై, ఇంటిలోని వ్యక్తులపై ప్రత్యేక్ష, పరోక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఇంటిలో అయినా, ఆఫీసుల్లో అయినా వస్తు నియమాలు పాటిస్తే అది సానుకూల ఫలితాలను ఇస్తుంది. లేదంటే ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

అయితే కొంత మంది చాలా సంపాదిస్తారు కానీ, డబ్బును పొదుపు చేయలేరు. అయితే ఇలా ఎంత సంపాదించినా డబ్బు కూడబెట్టకపోవడం కూడా వాస్తు దోషమే అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అయితే ఎలాంటి నియమాలు పాటించడం వలన ఆర్థిక సమస్యలు సద్దుమణుగుతాయో ఇప్పుడు చూద్దాం.

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటిలో సంపద పెరగాలి అంటే, మీ ఇంటిలో డబ్బు, ఆభరణాలను ఎప్పుడూ కూడా ఉత్తర దిశలో పెట్టాలంట. దీని వలన డబ్బు ఎక్కువ కాలం ఉంటుంది అని చెబుతున్నారు పండితులు. అంతే కాకుండా వెండి నాణెం లేదా, శ్రీ యంత్రాన్ని మీ అల్మారాకు పెట్టడం చాలా మంచిదంట.

వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిశను కుభేరుడి దిశ అంటారు. అక్కడ కుబేరుడు నివాసం ఉంటాడు. అయితే ఎప్పుడూ కూడా ఉత్తర దిశను చాలా శుభ్రంగా ఉంచాలంట. అంతే కాకుండా, ఉత్తరం దిశలో కుబేరుడి విగ్రహం లేదా, చిత్ర పటాన్ని పెట్టడం వలన ఆర్థిక సమస్యలు తీరిపోయి, సంపద పెరుగుతుందంట.

ఆర్థిక సమస్యలతో బాధపడే వారు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించాలంట. అమ్మవారికి కమలం పూలు సమర్పిస్తూ, పూజలు చేయాలంట. ఎప్పుడూ ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలంట. అప్పుడే ఇంటిలో సంపద నిలుస్తుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.



