కూరలో కరివేపాకు తాపీగా తీసి పక్కన పెట్టేస్తున్నారా? కాస్త ఆగండి

19 March 2026

TV9 Telugu

TV9 Telugu

కూర్లో కరివేపాకు కనిపించగానే.. చిరాగ్గ దాన్ని తీసి పక్కన పెట్టేయడం మనలో మనలో చాలా మందికి అలవాటే. కానీ కరివేపాకు వంటకు  చక్కని వాసన, రుచికే కాదు ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది

TV9 Telugu

ఔష‌ధ గుణాలు దండిగా ఉన్న కరివేపాకు గుండె ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో, కాలేయ ప‌నితీరును మెరుగుప‌ర‌చ‌డంలో, జుట్టు పెరుగుద‌ల‌కు, జీర్ణ స‌మ‌స్యల‌ను త‌గ్గించ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా స‌హాయ‌ప‌డుతుంది

TV9 Telugu

క‌రివేపాకును తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ ఎంజైమ్‌లు ఎక్కువ‌గా విడుద‌ల అవుతాయి. ఇవి పేగు ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, ఉబ్బరాన్ని త‌గ్గించ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. క‌రివేపాకు డ‌యాబెటిస్ వ్యాధి గ్రస్తుల‌కు కూడా ఎంతో మేలు చేస్తుంది

TV9 Telugu

క‌రివేపాకులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ ల‌క్షణాలు డ‌యాబెటిస్ నిర్వహ‌ణ‌లో స‌హాయ‌ప‌డతాయి. క‌రివేపాకును తీసుకోవ‌డం వ‌ల్ల క‌ణాల ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. త‌ద్వారా దీర్ఘకాలిక అనారోగ్య స‌మ‌స్యల బారిన ప‌డే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయి

TV9 Telugu

ఇక జుట్టును, త‌ల‌చ‌ర్మం ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో కూడా క‌రివేపాకు కీల‌క‌పాత్ర పోషిస్తుంది. వీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో నాలుగు రెబ్బలు తింటే ఎంతో మేలు. క‌రివేపాకులో ఉండే బ‌యోయాక్టివ్ స‌మ్మేళ‌నాలు, విట‌మిన్లు జుట్టు ఆరోగ్యాన్ని స‌హ‌జంగా పెంచుతాయి

TV9 Telugu

ఆహారంలో క‌రివేపాకును తీసుకోవ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం త‌గ్గి జుట్టు కుదుళ్లు బ‌లంగా త‌యార‌వుతాయి.అలాగే క‌రివేపాకులో ఉండే ఆమైనో ఆమ్లాలు చ‌ర్మానికి ర‌క్తప్రస‌ర‌ణ పెరిగేలా చేస్తాయి. దీంతో ఫోలిక‌ల్స్ కు పోష‌కాలు చ‌క్కగా అందుతాయి

TV9 Telugu

క‌రివేపాకును ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల జుట్టు ఒత్తుగా, న‌ల్లగా పెరుగుతుంది. కొలెస్ట్రాల్ ను త‌గ్గించ‌డంలో కూడా క‌రివేపాకు ఉప‌యోగ‌ప‌డుతుంది. దీనిలో ఉండే బ‌యోయాక్టివ్ స‌మ్మేళ‌నాలు గుండె ఆరోగ్యానికి ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటాయి

TV9 Telugu

ఇలా క‌రివేపాకు మ‌న‌కు బ‌హుళ ఆరోగ్య ప్రయోజ‌నాల‌ను అందిస్తుంద‌ని దీనిని ప్రతిరోజూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చని నిపుణులు సూచిస్తున్నారు