- Telugu News Photo Gallery Spiritual photos Sun Kuja Conjunction: Major Auspicious Benefits for These Rashis until Dec 7th Telugu Astrology
కుజ బలంతో ఈ రాశుల వారికి సరికొత్త దశ, దిశ! ఆశలు నెరవేరుతాయ్..!
ఈ నెల(నవంబర్) 16న రవి వృశ్చిక రాశి ప్రవేశించడంతో కుజ బలం మరింతగా పెరగబోతోంది. ప్రస్తుతం స్వస్థానమైన వృశ్చిక రాశిలోనే సంచారం చేస్తున్న కుజుడికి గ్రహ రాజు రవి తోడయ్యే పక్షంలో అనేక విషయాల్లో దిక్కుతోచకుండా అగమ్య గోచరంగా ఉన్నవారికి సరికొత్త దశ, దిశ లభిస్తాయి. ఈ రవి, కుజుల ప్రభావం కుజుడు వృశ్చిక రాశి నుంచి నిష్క్రమించే వరకు, అంటే డిసెంబర్ 7 వరకు కొనసాగుతుంది. ఈ రెండు గ్రహాలు అనుకూలంగా ఉన్నవారిలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి ఉద్యోగం లభించడం, పెళ్లి కావాల్సిన వారికి పెళ్లి సంబంధం కుదరడం, అప్పులు తీరడం, ఆదాయం పెరగడం వంటివి జరిగే అవకాశం ఉంది. కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, కుంభ రాశుల వారి ఆశలు, ఆకాంక్షలు తప్పకుండా నెరవేరుతాయి.
Updated on: Nov 16, 2025 | 8:55 PM

కర్కాటం: పంచమ స్థానమైన వృశ్చిక రాశిలో కుజ, రవుల కలయిక వల్ల ఈ రాశివారి మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఉద్యోగంలో సమర్థతకు గుర్తింపుగా పదోన్నతులు లభిస్తాయి. కొద్ది మార్పులతో వృత్తి, వ్యాపారాలు పట్టాలెక్కుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఇంత వరకూ పరిష్కారం కాని సమస్యలన్నీ ఇక పరిష్కారమవుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది.

సింహం: రాశ్యధిపతి రవి నాలుగవ స్థానంలో ఈ రాశికి అత్యంత శుభుడైన కుజుడిని కలవడం వల్ల చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న మొండి సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ముఖ్యంగా ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు సానుకూలంగా పరిష్కారమవుతాయి. ఆస్తిపాస్తులు బాగా కలిసి వస్తాయి. గృహ యోగం పడుతుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

వృశ్చికం: ఈ రాశిలో రాశ్యధిపతి కుజుడు రవిని కలవడం వల్ల రాజపూజ్యాలు కలుగుతాయి. ఉద్యోగంలోనే కాక, ప్రభుత్వం నుంచి కూడా గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి దాదాపు పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. సామాజికంగా పేరు ప్రతిష్ఠలు వృద్ధి చెందుతాయి. ఆదాయ వృద్దికి ఎటువంటి ప్రయత్నం చేపట్టినా విజయం సిద్దిస్తుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు పెరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.

మకరం: ఈ రాశికి లాభస్థానంలో కుజ, రవులు కలవడం వల్ల ఆదాయం వృద్ధి చెందడం, ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం కావడం జరుగుతుంది. డిసెంబర్ 7వరకు ఆదాయం వృద్ది చెందడమే తప్ప తగ్గడం ఉండదు. ప్రభుత్యం నుంచి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. రాజపూజ్యాలు కలుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు కష్టనష్టాల నుంచి చాలావరకు బయటపడడంతో పాటు, యాక్టివిటీ బాగాపెరుగుతుంది. ఆరోగ్య లాభం కలుగుతుంది.

కుంభం: దశమ స్థానంలో రవి, కుజుల కలయిక వల్ల ఈ రాశివారికి రెండు విధాలుగా దిగ్బల రాజయోగం కలిగింది. ఒక ప్రముఖుడుగా గుర్తింపు లభిస్తుంది. కీర్తి ప్రతిష్ఠలు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం పడుతుంది. అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారి కోరిక నెరవేరుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది.



