AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వందేళ్ల తర్వాత హోలీరోజు చంద్రగ్రహణం.. ఈ పరిహారాలతో మీ అదృష్టం డబుల్..!

Lunar Eclipse 2026: మార్చి 3న చంద్రగ్రహణం పూర్వ ఫల్గుణి (పుబ్బ) నక్షత్రంలో, సింహ రాశిలో కేతుగ్రస్తంగా ఏర్పడుతుంది. చంద్రుడు సింహరాశిలో సంచరిస్తూ కేతుతో సమీపంలో ఉండటం వల్ల కొన్ని రాశులపై దీని ప్రభావం తీవ్రంగా ఉండవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే మార్చి 2 నుంచి సూర్యుడు, బుధుడు, రాహువు, కుజుడు కలిసి కుంభరాశిలో శక్తివంతమైన చతుర్గ్రాహి యోగాన్ని ఏర్పరుస్తున్నారు. ఇది కొన్ని రాశులకు శుభఫలితాలు ఇస్తే, మరికొన్నివారికి పరీక్షల కాలంగా మారవచ్చు.

వందేళ్ల తర్వాత హోలీరోజు చంద్రగ్రహణం.. ఈ పరిహారాలతో మీ అదృష్టం డబుల్..!
Holi2026
Rajashekher G
|

Updated on: Mar 03, 2026 | 3:15 PM

Share

చంద్రగ్రహణం రోజునే హోలీ పండుగ రావడం వల్ల ఈసారి ఆధ్యాత్మికంగా, జ్యోతిష్యపరంగా ప్రత్యేక ఆసక్తి నెలకొంది. హోలీ చెడుపై మంచి విజయానికి ప్రతీకగా భావించబడుతుంది. రంగుల పండుగ ప్రజల జీవితాల్లో ఆనందం, ఉత్సాహం, కొత్త ఆశలను నింపుతుందని విశ్వసిస్తారు. హోలీ తేదీ నిర్ణయంలో పౌర్ణమి తిథి కీలక పాత్ర పోషిస్తుంది. 2026 మార్చి 3, మంగళవారం హోలికా దహనం జరగనుంది. అయితే అదే రోజు చంద్రగ్రహణం సంభవించనుండటంతో పూజా విధానాల్లో స్వల్ప మార్పులు ఉండనున్నాయి. జ్యోతిష్య నిపుణుల సూచనల ప్రకారం గ్రహణం ముగిసిన తరువాతే హోలికా దహనం చేయడం శ్రేయస్కరం. మార్చి 2 పౌర్ణమి ఘడియల్లో భద్రకాలానికి ముందుగా హోలికా దహనం నిర్వహించి, మార్చి 3న గ్రహణ కారణంగా ప్రధాన పూజలు నివారించి, మార్చి 4న రంగుల పండుగ జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు.

గ్రహణం జ్యోతిష్య ప్రభావం

ఈ చంద్రగ్రహణం పూర్వ ఫల్గుణి (పుబ్బ) నక్షత్రంలో, సింహ రాశిలో కేతుగ్రస్తంగా ఏర్పడుతుంది. చంద్రుడు సింహరాశిలో సంచరిస్తూ కేతుతో సమీపంలో ఉండటం వల్ల కొన్ని రాశులపై దీని ప్రభావం తీవ్రంగా ఉండవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే మార్చి 2 నుంచి సూర్యుడు, బుధుడు, రాహువు, కుజుడు కలిసి కుంభరాశిలో శక్తివంతమైన చతుర్గ్రాహి యోగాన్ని ఏర్పరుస్తున్నారు. ఇది కొన్ని రాశులకు శుభఫలితాలు ఇస్తే, మరికొన్నివారికి పరీక్షల కాలంగా మారవచ్చు.

ప్రత్యేక జాగ్రత్తలు అవసరమైన రాశులు

కర్కాటక రాశి

  • మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం.
  • చిన్న విషయానికీ ఆందోళన చెందవచ్చు.
  • కొత్త కొనుగోళ్లు వాయిదా వేయడం మంచిది.
  • ఆఫీసు, వ్యాపార రంగాల్లో ఒడిదుడుకులు.
  • సహోద్యోగులతో విభేదాలు.
  • కడుపు, రక్తపోటు సమస్యలపై జాగ్రత్త.
  • ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తత అవసరం.

సింహ రాశి

  • కేతుగ్రస్త గ్రహణ ప్రభావం ప్రత్యక్షంగా ఉంటుంది.
  • ఆరోగ్య సమస్యలు (తలనొప్పి, అలసట, కంటి సమస్యలు) రావచ్చు.
  • ఉన్నతాధికారులతో విభేదాలు.
  • మానసిక ప్రశాంతతను కాపాడుకోవాలి.
  • ఆహార నియమాలు పాటించడం మంచిది.

కుంభ రాశి

  • ఐదు గ్రహాల సంచారం వల్ల ఇబ్బందులు.
  • తల్లి ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం.
  • ఖర్చులు పెరగవచ్చు.
  • కుటుంబ ఉద్రిక్తతలు, నిద్రలేమి.
  • ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.

అలాగే ధనస్సు, మేషం, కన్య రాశుల వారు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా పుబ్బ నక్షత్ర జాతకులు జాగ్రత్తలు పాటించాలి.

పరిహారాలు

  • గ్రహణ ప్రభావం సుమారు 40 రోజుల వరకు ఉండవచ్చని చెబుతున్నారు. దుష్ప్రభావాలను తగ్గించుకోవడానికి:
  • గ్రహణం మరుసటి రోజు దానాలు చేయాలి.
  • చిన్న మెటల్ సూర్య, చంద్ర ప్రతిమలు, నాగపడగలు దానం చేయవచ్చు.
  • బియ్యం, గోధుమలు, ఉలవలు, మినుములు, నువ్వులు దానం చేయడం శ్రేయస్కరం.
  • ఆవు నెయ్యి కలిపిన ఇత్తడి పాత్ర దానం చేయవచ్చు.
  • విదేశాల్లో ఉన్నవారు తమ తరఫున భారత్‌లో బంధువుల ద్వారా దానం చేయించవచ్చు.
  • గ్రహణ సమయంలో ఇష్టదైవ మంత్ర జపం లేదా గురువుల నుండి పొందిన మంత్రాన్ని జపించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు.

సామాజిక – రాజకీయ ప్రభావం

జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం ఈ గ్రహణం రాజకీయ, సామాజిక రంగాల్లో మార్పులకు దారితీయవచ్చు. ముఖ్యంగా రాజకీయ నాయకులు, దేశాధినేతలు, వైద్య రంగానికి చెందినవారు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. విభేదాలు, ఆరోగ్య సమస్యలు, పరస్పర విమర్శలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.

ఈసారి హోలీ, చంద్రగ్రహణం కలిసివచ్చినందున ఆధ్యాత్మికంగా, జ్యోతిష్యపరంగా ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. విశ్వాసాలు పాటిస్తూ, జాగ్రత్తలు తీసుకుంటూ, ఆనందంగా పండుగను జరుపుకోవడం మంచిదని పండితులు సూచిస్తున్నారు.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్యం, మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

Follow Us