ఒక్క ఎపిసోడ్‏కు రూ.2.5 లక్షలా..? ఈ సీరియల్ బ్యూటీ క్రేజ్ చూస్తే..

Rajitha Chanti

Pic credit - Instagram

03 March 2026

బాలీవుడ్ బుల్లితెరపై తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి శ్వేతా తివారీ. హిందీ సీరియల్స్ చూసే ప్రతి ఒక్కరికి ఆమె సుపరిచితమే. 2000లో కెరీర్ స్టార్ట్ చేసింది.

వాలా పాల్ అనే హిందీ సీరియల్ ద్వారా నటిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత కసౌతి జిందగీ కి అనే సీరియల్ ద్వారా ఆమె టీవీ పరిశ్రమలో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది.

2001 నుంచి 2008 వరకు ప్రసారమైన ఈ సీరియల్ ఆమె కెరీర్ ను మార్చేసింది. ఈ సీరియల్ ప్రారంభించినప్పుడు ఆమె ఒక్క ఎపిసోడ్ కోసం రూ.2500 తీసుకుందట. 

కానీ ఆ సీరియల్ ముగిసేనాటికి ఆమె రోజుకు రూ2.5 లక్షలు పారితోషికం తీసుకుందని టాక్. ఆమె అత్యధిక పారితోషికం పొందే హిందీ టీవీ సీరియల్ హీరోయిన్లలో ఒకరు.

 ప్రస్తుతం ఆమె ఒక్క ఎపిసోడ్ కోసం రూ.3 లక్షలు తీసుకుంటుంది. హిందీ రియాల్టీ డ్యాన్స్ షోస్ చేస్తుంది. అలాగే బిగ్ బాస్ రియాల్టీ షోలనూ ఈ అమ్మడు పాల్గొన్న సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ షో 4వ సీజన్‌లో కూడా శ్వేతా తివారీ పాల్గొని టైటిల్ గెలుచుకుంది. హౌస్ లో ఉన్నప్పుడు ఆమె వారానికి రూ. 5 లక్షల పారితోషికం తీసుకుందని సమాచారం. 

శ్వేతా తివారీ సంవత్సరానికి రూ.10 కోట్లకు పైగా సంపాదిస్తున్నట్లు టాక్. నివేదికల ప్రకారం ఆమె ఆస్తులు రూ.81 కోట్లు. సీరియల్స్, యాడ్స్ ద్వారా సంపాదిస్తుంది.

శ్వేతా ప్రస్తుతం ఒంటరిగా ఉంటుంది. 18 ఏళ్లకే రాజా చౌదరిని వివాహం చేసుకుంది. అతడితో విడాకుల తర్వాత అభినవ్ కోహ్లీని పెళ్లి చేసుకుంది. అతడితోనూ విడిపోయింది.