AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRB Group D Jobs 2026: నిరుద్యోగాలకు మరో ఛాన్స్.. రైల్వేలో 22,195 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు! టెన్త్‌ అర్హత

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తం 22,195 గ్రూప్‌ డి ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు సోమవారం (మార్చి 2)తో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అభ్యర్ధుల విజ్ఞప్తుల మేరకు ఆర్ఆర్‌బీ ఉద్యోగాల దరఖాస్తు గుడువును పొడిగించింది..

RRB Group D Jobs 2026: నిరుద్యోగాలకు మరో ఛాన్స్.. రైల్వేలో 22,195 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు! టెన్త్‌ అర్హత
RRB Group D Railway Jobs
Srilakshmi C
|

Updated on: Mar 03, 2026 | 2:59 PM

Share

హైదరాబాద్, మార్చి 3: భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తం 22,195 గ్రూప్‌ డి ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు సోమవారం (మార్చి 2)తో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అభ్యర్ధుల విజ్ఞప్తుల మేరకు ఆర్ఆర్‌బీ ఉద్యోగాల దరఖాస్తు గుడువును పొడిగించింది. ఈ మేరకు ఆర్‌ఆర్‌బీ రైల్వే ఉద్యోగాల దరఖాస్తు గడువు మార్చి 9వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు పొడిగించింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ముగింపు గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతితోపాటు సంబంధిత విభాగంలో ఐఐటీ డిప్లొమా అర్హత కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా ఈ నోటిఫికేషన్‌ కింద పాయింట్స్‌మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ తదితర ఖాళీలు భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే.

మొత్తం పోస్టుల్లో సౌత్‌ సెంట్రల్‌ రైల్వే పరిధిలోని సికింద్రాబాద్‌లో మొత్తం 1012 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు సమయంలో జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు రూ.250 చొప్పున తప్పనిసరిగా చెల్లించాలి. పరీక్షకు హాజరైతే ఇందులో చాలా వరకు రిఫండ్‌ అవుతుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు దరఖాస్తు గడువు ముగిసేలోపు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: మార్చి 9, 2026 రాత్రి 11.59 గంటల వరకు
  • ఫీజు చెల్లింపులకు చివరి తేదీ: మార్చి 11, 2026 రాత్రి 11. 59 గంటల వరకు
  • దరఖాస్తు సవరణ తేదీలు: మార్చి 12 నుంచి 21వ తేదీ వరకు
  • రాత పరీక్ష తేదీలు: ఇంకా ప్రకటించలేదు

ఆర్‌ఆర్‌బీ రైల్వే గ్రూప్‌ డీ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అతన్ని పక్కనబెట్టి.. వైభవ్‌ని ఆడించాలా? మీకసలు మైండ్ ఉందా?
అతన్ని పక్కనబెట్టి.. వైభవ్‌ని ఆడించాలా? మీకసలు మైండ్ ఉందా?
పిక్నిక్ వచ్చిన లేడీస్.. కార్ వెనుక అదిరిపోయే సెటప్.. కట్‌చేస్తే
పిక్నిక్ వచ్చిన లేడీస్.. కార్ వెనుక అదిరిపోయే సెటప్.. కట్‌చేస్తే
50 సినిమాల్లో ఒకే హీరోతో 40కి పైగా సినిమాలు.. కట్ చేస్తే
50 సినిమాల్లో ఒకే హీరోతో 40కి పైగా సినిమాలు.. కట్ చేస్తే
శని నక్షత్రం మారుతోంది.. ఈ 4 రాశుల లైఫ్‌లో టఫ్ టైమ్ స్టార్ట్!...
శని నక్షత్రం మారుతోంది.. ఈ 4 రాశుల లైఫ్‌లో టఫ్ టైమ్ స్టార్ట్!...
ఈసారి పదో తరగతి ఫలితాల్లో గరిష్ట ఉత్తీర్ణత.. ఇకపై ఫెయిల్ ఉండదు
ఈసారి పదో తరగతి ఫలితాల్లో గరిష్ట ఉత్తీర్ణత.. ఇకపై ఫెయిల్ ఉండదు
ఇకపై డోర్‌ క్లోజ్ అయినా.. మీరు వందేభారత్‌ ఎక్కవచ్చు.. ఎలా అంటే?
ఇకపై డోర్‌ క్లోజ్ అయినా.. మీరు వందేభారత్‌ ఎక్కవచ్చు.. ఎలా అంటే?
అమలులోకి కొత్త ఈవీ పాలసీ.. ఎప్పటినుంచంటే..?
అమలులోకి కొత్త ఈవీ పాలసీ.. ఎప్పటినుంచంటే..?
Team India: దమ్మున్నోడిని పక్కనపెట్టి, దద్దమ్మలను ఆడిస్తారా..
Team India: దమ్మున్నోడిని పక్కనపెట్టి, దద్దమ్మలను ఆడిస్తారా..
అమర్‌నాథ్ యాత్రకి వెళ్తున్నారా? ఈ వస్తువులు లేకపోతే అనుమతి కూడా..
అమర్‌నాథ్ యాత్రకి వెళ్తున్నారా? ఈ వస్తువులు లేకపోతే అనుమతి కూడా..
ఇంట్లో మిరపకాయల చెట్టు ఉండకూడదా? పండితులు ఏం చెబుతున్నారంటే?
ఇంట్లో మిరపకాయల చెట్టు ఉండకూడదా? పండితులు ఏం చెబుతున్నారంటే?