రూ.500 నుంచి ఒక్కో సినిమాకు 4 కోట్లు.. ఈ హీరోయిన్ రేంజ్ వేరప్పా..
Rajitha Chanti
Pic credit - Instagram
03 March 2026
దక్షిణాది సినిమా పరిశ్రమలో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగింది హీరోయిన్ కీర్తి సురేష్. మొన్నటివరకు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ అమ్మడు.
బాలనటిగా తెరంగేట్రం చేసిన ఆమె కథానాయికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన మొదటి సినిమాకు ఈ అమ్మడు కేవలం రూ.500 మాత్రమే తీసుకుంది.
చిన్నప్పుడే సినిమాల్లో నటించిన కీర్తి.. అటు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సును పూర్తి చేసింది. ఆ తర్వాతే పూర్తి స్థాయి నటిగా వెండితెరపై అడుగుపెట్టి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది కీర్తి.
నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ ఆమె కెరీర్ మలుపు తిప్పిన సినిమా అంటే మహానటి.
లెజెండరీ నటి సావిత్రి బయోపిక్ గా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ కావడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.4 నుంచి 5 కోట్లు తీసుకుంటుంది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తుంది. అలాగే వ్యక్తిగత జీవితం కూడా చాలా స్పెషల్ అనే చెప్పాలని. ఇటీవలే ఆమె వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది.
తన చిన్ననాటి స్నేహితుడు ప్రియుడు ఆంటోని తట్టిల్ ను వివాహం చేసుకుంది. 15 ఏళ్ల స్నేహం తర్వాత వీరిద్దరు ఇరు కుటుంబాల సమక్షంలో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.
పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది కీర్తి సురేష్. అటు సినిమాలు, ఇటు లైఫ్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తుంది. ప్రస్తుతం ఆమె 10 సినిమాల్లో నటిస్తున్నట్లు టాక్.