AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నల్లగా ఉన్నావ్ అంటూ అవమానాలు.. కట్ చేస్తే టాలీవుడ్ క్రేజీ హీరో.. బ్యాక్ టు బ్యాక్ హిట్స్..

హీరోగా వెండితెరపై కనిపించాలనే కల. నటనపై ఉన్న ఇష్టంతో హైదరాబాద్ వచ్చి ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నవారు చాలా మంది ఉన్నారు. అందులో ఈ హీరో ఒకరు. యూట్యూబ్ వీడియోలతో కెరీర్ స్టార్ట్ చేసి.. సిల్వర్ స్క్రీన్ పై నటుడిగా ఇమేజ్ సంపాదించుకున్నారు.

నల్లగా ఉన్నావ్ అంటూ అవమానాలు.. కట్ చేస్తే టాలీవుడ్ క్రేజీ హీరో.. బ్యాక్ టు బ్యాక్ హిట్స్..
Tollywood Hero
Rajeev Rayala
|

Updated on: Mar 03, 2026 | 3:23 PM

Share

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది కష్టపడి పైకి వచ్చినవారే.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎదిగిన వారు చాలా మంది ఉన్నారు. అలాంటివారిలో పైన కనిపిస్తున్న హీరో ఒకరు. చిన్న చిన్న పాత్రల నుంచి ఎదిగి ఇప్పుడు ఇండస్ట్రీలో బిజీ హీరోగా మారాడు. హీరోల పక్కడ ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేస్తూ.. ప్రేక్షకులకు పరిచయమైన అతను.. ఇప్పుడు వర్సటైల్ యాక్టర్ గా రాణిస్తున్నాడు. హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. నల్లగా ఉన్నావ్ అంటూ అవమానించారు. కట్ చేస్తే టాలీవుడ్ లో క్రేజీ హీరో. వరుసగా హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇంతకూ అతను ఎవరో గుర్తుపట్టారా.?

ఒకే ఒక్క సీన్ సినిమా రేంజ్‌నే మార్చేసింది.. కట్ చేస్తే రూ.400కోట్ల బ్లాక్ బస్టర్

వైవిధ్యమైన కథలకు అతను కేరాఫ్ అడ్రస్. చాలా మంది నటీనటులు షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చి ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అలా ఇండస్ట్రీలోకి వచ్చిన వ్యక్తే సుహాస్. సినిమాల్లోకి రాక ముందుసుహాస్ కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించి మెప్పించాడు. ఇక శర్వానంద్ హీరోగా నటించిన పడి పడి లేచే మనసు సినిమా ద్వారా సినిమాల్లోకి వచ్చాడు. ఆ సినిమాలో హీరో ఫ్రెండ్ గా నటించాడు. ఆతర్వాత నాగ చైతన్య నటించిన మజిలీ సినిమాలోనూ హీరో ఫ్రెండ్ పాత్రలోనే కనిపించాడు. ఇక సుహాస్ హీరోగా నటించిన మొదటి సినిమా కలర్ ఫోటో.

ఇవి కూడా చదవండి

అప్పు.. అప్పటికీ ఇప్పటికీ ఎంత మార్పు.!! సినిమాలకు గుడ్ బై చెప్పేసిన హ్యాపీడేస్ నటి

ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అంతే కాదు ఈ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది. కాగా సుహాస్ నాగ చైతన్యతో ఫ్రెండ్ పాత్రలో నటించాడు. ఇప్పుడు చైతన్య కంటే సుహాస్ ఎక్కువ సినిమాల్లో నటిస్తున్నాడని నెట్టింట టాక్ వినిపిస్తుంది. నాగ చైతన్య ఇప్పటివరకు 25 సినిమాలు చేయగా సుహాస్ ఇప్పటికే 24 సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలను కూడా లైనప్ చేసి బిజీగా ఉన్నాడు.  ఇటీవల హే బల్‌వంత్ సినిమాతో హిట్ అందుకున్నాడు సుహాస్. ఇప్పుడు ఓ తమిళ్ సినిమాలో నటిస్తున్నాడు.

అప్పట్లో రచ్చ లేపింది.. ట్రెండ్ సెట్ చేసిన గుడుంబా శంకర్ ప్యాంట్ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా.?

View this post on Instagram

A post shared by Suhas (@suhassssssss)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us