AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ ఆట, పాట, ఆత్మను ప్రపంచానికి చాటిచెప్పిన వ్యక్తి గద్దర్ :భట్టి విక్రమార్క

గద్దర్ అవార్డ్స్ వేడుక ఈసారి ఉగాది సందర్భంగా హైదరాబాద్‌లో ఎంతో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరై తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ఈ వేడుకలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

తెలంగాణ ఆట, పాట, ఆత్మను ప్రపంచానికి చాటిచెప్పిన వ్యక్తి గద్దర్ :భట్టి విక్రమార్క
Bhatti Vikramarka
Rajeev Rayala
|

Updated on: Mar 19, 2026 | 10:11 PM

Share

2025 గద్దర్ అవార్డుల ప్రదానోత్సవంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ..  గద్దర్ అవార్డులకు ఎంపికైన నటీనటులకు, టెక్నీషన్స్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున అభినందనలు తెలిపారు. గద్దర్ అవార్డ్స్ దేశానికే తలమానిక అవ్వాలని పట్టుదలతో తెలంగాణ గద్దర్ అవార్డులను తిరిగి ప్రవేశపెట్టి.. దిగ్విజయంగా దేశానికే కాదు.. ప్రపంచానికి పరిచయం చేసేలా అవార్డులను అందిస్తున్నందుకుసంతోషిస్తున్నాము. తెలుగు సినిమా పరిశ్రమ హాలీవుడ్ స్థాయికి వెళ్లడం సంతోషం.. సినిమా అనేది కేవలం కళల కోసమే కాదు.. ప్రజల కోసం అని చాటి చెప్పిన సినిమాలు చాలా ఉన్నాయి.

కేవలం సందేశాన్ని ఇవ్వడమే కాదు కమర్షియల్ గా హిట్ అయిన సినిమాలు కూడా ఎన్నో ఉన్నాయి. అనేక సినిమాలు సందేశాన్ని ఇవ్వడమే కాదు సమాజానికి ఉపయోగపడుతూ.. మార్పు కోసం నాంది పలికాయి. ఈ రోజుకు కూడా అనేకసామజిక సందేశంతో ఉన్న సినిమాలకు అవార్డులను ప్రకటించడాన్ని అభినందిస్తున్నా.. ఎంపికైన నటీనటులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా..

గద్దర్ అనే వ్యక్తి కేవలం వ్యక్తిగా కాకుండా.. ఒక వ్యవస్థగా.. ఒక సందేశసాత్మకమైన తెలంగాణ ఆటను, పాటను తెలంగాణ ఆత్మని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి గద్దర్..  అలాంటి గద్దర్ గారి పేరు మీద అవార్డులను ప్రకటించి.. ప్రభుత్వ ఆలోచన విధానం ఏంటో ప్రపంచ వ్యాప్తంగా తెలుపడానికి ఈ అవార్డులను అందిస్తుంది. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని తన ప్రసంగాన్ని ముగించారు భట్టి విక్రమార్క

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us