AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబోయ్.. బంగారం కంటే ఖరీదైన బియ్యం.. ఈ అన్నం తినాలంటే పెట్టి పుట్టి ఉండాలేమో..!

భారతదేశంలో ప్రతి ఒక్కరి ఆహారంలో బియ్యం అంతర్భాగం. మార్కెట్లో బియ్యం ఖరీదు రూ.30 నుండి రూ.80 వరకు ఉంటుంది. కానీ, ఒక దేశంలో పండించే ప్రత్యేక బియ్యం కిలో ధర ఎంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే.. అది ఎవరికీ నమ్మశక్యం కానిది. నిజంగానే ఈ దేశంలో పండించే బియ్యం కిలో ధర తెలిస్తే షాక్‌ అవుతారు.. ఎందుకంటే.. ఈ దేశంలో బియ్యం ధర బంగారం కంటే ఖరీదు. ప్రపంచ రికార్డు సృష్టించిన ఈ ధాన్యం ధర ఉంటుందో ఊహించగలరా..?

బాబోయ్.. బంగారం కంటే ఖరీదైన బియ్యం.. ఈ అన్నం తినాలంటే పెట్టి పుట్టి ఉండాలేమో..!
World's Most Expensive Rice
Jyothi Gadda
|

Updated on: Nov 10, 2025 | 7:13 AM

Share

బియ్యం లేకుండా భోజనం అసంపూర్ణంగా ఉంటుంది. భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా బియ్యాన్ని ఇష్టపడతారు. ప్రపంచవ్యాప్తంగా రకరకాల బియ్యం రకాలు పండిస్తున్నారు రైతులు. మన దేశంలో ఎవరినైనా మంచి బియ్యం రకం గురించి అడిగితే నిస్సందేహంగా బాస్మతి గురించి చెబుతారు. ఈ రకం రైస్‌ అన్నం రుచి, వాసన ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. ఇది పొడవైన ధాన్యం బియ్యం అద్భుతమైన రకం. అయితే, ఖరీదైన బియ్యం ధర విషయానికి వస్తే బాస్మతి బియ్యం చాలా వెనుకబడి ఉంది. కిలో ధర 90 రూపాయల నుండి 700 రూపాయల వరకు ఉంటుంది. మనదేశంలో అనేక బియ్యం రకాలు ఉన్నాయి. వాటి ధరలు కిలోకు 6,000 నుండి 7,000 రూపాయల వరకు ఉంటాయి. కానీ, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యం ఏది..? దాని ధర ఎంతో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

ప్రపంచవ్యాప్తంగా రకరకాల బియ్యం రకాలు ఉత్పత్తి అవుతున్నా, జపాన్‌లో పండించే కిన్మెమై ప్రీమియం అనే బియ్యం అత్యంత ఖరీదైనదిగా గుర్తింపు పొందింది. ఈ బియ్యం ఒక్క కిలోకు దాదాపు రూ.12,500 ధర పలుకుతోంది. విలాసవంతమైన జీవనశైలికి సంకేతంగా నిలిచిన ఈ బియ్యం 2016లో 840 గ్రాములకు రూ.5,490 ధరతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో “ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యం”గా నమోదైంది. జపాన్ రైతులు దీన్ని అత్యంత శ్రద్ధతో అధునాతన వ్యవసాయ సాంకేతికతతో పండిస్తారు.

ఈ బియ్యాన్ని టోయో రైస్ కార్పొరేషన్ అనే సంస్థ మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. ఈ కంపెనీని 1961లో స్థాపించారు. ఈ జపనీస్ కిన్మీ రైస్ ప్రపంచవ్యాప్తంగా ప్రీమియం బియ్యంగా పిలుస్తుంటారు. బియ్యం ఉత్పత్తిలో అధునాతన సాంకేతిక ఉపయోగించడం, రుచికరమైన బియ్యాన్ని తయారు చేయడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం.

ఇవి కూడా చదవండి

ఈ బియ్యాన్ని కడగకుండానే నేరుగా వండుకోవచ్చు. ఈ బియ్యంలో నీటి వృధా తగ్గుతుంది. ఇది పర్యావరణ అనుకూలమైనది. ఈ బియ్యంలో సాధారణ తెల్ల బియ్యం కంటే ఆరు రెట్లు ఎక్కువ లిపోపాలిసాకరైడ్లు ఉంటాయి. ఇందులో విటమిన్ బి, ఫైబర్, అమైనో ఆమ్లాలు కూడా అధికంగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ, రోగనిరోధక శక్తికి సహాయపడుతుంది.

దాదాపు 3,000 సంవత్సరాలుగా జపాన్ ఆహారంలో బియ్యం ప్రధానమైనవి. నేడు, దేశంలో 300 కంటే ఎక్కువ రకాల బియ్యం పండిస్తున్నారు. అయితే, కిన్మెమై ప్రీమియం బియ్యం దాని ప్రత్యేక నాణ్యతతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..