AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Tour Package: తెలుగు రాష్ట్రాల ప్రజలకు సూపర్ ఛాన్స్.. ఐఆర్‌సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజ్.. ఒక్క టూర్‌తో అన్నీ..

హైదరాబాద్‌లోని చారిత్రాత్మక పర్యాటక ప్రదేశాలతో పాటు యాదాద్రి, రామోజీ ఫిల్మ్ సిటీలను చూడాలనుకుంటున్నారా.. అయితే మీకు శుభవార్త. ఐఆర్‌సీటీసీ మీకు మంచి అవకాశం కల్పిస్తోంది. నాలుగు రోజుల టూర్‌ను తాాజాగా ప్రవేశపెట్టింది. ఈ టూర్‌లో అనేక పర్యాటక ప్రదేశాలను చూడవచ్చు. వాటి వివరాలు ఇలా..

IRCTC Tour Package: తెలుగు రాష్ట్రాల ప్రజలకు సూపర్ ఛాన్స్.. ఐఆర్‌సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజ్.. ఒక్క టూర్‌తో అన్నీ..
Yadadri
Venkatrao Lella
|

Updated on: Mar 03, 2026 | 10:21 AM

Share

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలను సందర్శించాలనుకునేవారికి ఐఆర్‌సీటీసీ టూరిజం మంచి అవకాశం కల్పిస్తోంది. నాలుగు రోజుల ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఈ టూర్ శుక్రవారం మినహా మిగతా రోజుల్లో ప్రతీ రోజు ఉంటుంది. ఈ ప్యాకేజీలో యాదరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహాస్వామి ఆలయంతో పాటు చిలుకూరు బాలాజీ, స్వర్ణగిరి దేవాలయంతో పాటు రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శించవచ్చు. పూర్తిగా రోడ్డు మార్గంలో ఈ టూర్ ఉంటుంది. బస్సు సౌకర్యంతో పాటు బ్రేక్ ఫాస్ట్, డిన్నర్ సౌకర్యం పర్యాటకులకు కల్పిస్తారు. ఇక హైదరాబాద్‌లోని టూరిస్ట్ ప్లేసెస్‌ను కూడా చూడవచ్చు. ఈ టూర్ పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

సందర్శించే ప్రదేశాలు

తొలి రోజు హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్ల వద్ద పిక్ చేసుకుంటారు. మొదటి రోజు చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియం, బిర్లా మందిర్, లుంబినీ పార్క్ వంటి ప్రదేశాల సందర్శన ఉంటుంది. అనంతరం హోటల్‌లో బస ఉంటుంది. ఇక రెండు రోజు చిలుకూరి బాలాజీ టెంపుల్, లోటస్ టెంపుల్ దర్శన అవకాశం ఉంటుంది.  రాత్రి హోటల్‌లో వసతి సౌకర్యం ఉంటుంది మూడో రోజు యాదాద్రి లక్ష్మినరసింహస్వామి, స్వర్ణగిరి ఆలయాల సందర్శన ఉంటుంది. నాలుగో రోజు రామోజీ ఫిల్మ్ సిటీ విజిట్ ఉంటుంది. అనంతరం సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్ల వద్ద డ్రాప్ చేస్తారు

ప్యాకేజీ ధరలు ఇవే..

-డబుల్ షేరింగ్ ఒక్కో పర్సన్‌కు స్టాండర్ట్ రూ.17,430, కంఫర్ట్ రూ.20,590గా ఉంది.

-త్రిపుల్ షేరింగ్ స్టాండర్ట్ రూ.12,860, కంఫర్ట్ రూ.15,830గా ఉంది

-పిల్లలకు విత్ బెడ్ డబుల్ షేరింగ్ స్టాండర్డ్ రూ.8080, కంఫర్ట్ రూ.10,670

-పిల్లలకు విత్ బెడ్ త్రిపుల్ షేరింగ్ స్టాండర్డ్ ధర రూ.6220, కంఫర్ట్ ధర రూ.8080గా ఉంది.

-4 నుంచి 6 మంది ప్రయాణికులకు డబుల్ షేరింగ్ రూ.12,700, కంఫర్ట్ రూ.15,850గా ఉంది

-4 నుంచి 6 మంది ప్రయాణికులకు త్రిపుల్ షేరింగ్ స్టాండర్ట్ ధర రూ.10, 460గా ఉండగా.. కంఫర్ట్ ధర రూ.13,430గా ఉంది

సౌకర్యాలు ఇవే..

-హోటల్స్‌లో ఏసీ రూమ్ ఫెసిలిటీ

-బ్రేక్ ఫాస్ట్, డిన్నర్ సౌకర్యం

-ఏసీ బస్సులో ప్రయాణం

*ట్రావెల్ ఇన్యూరెన్స్

ఇవి ఉండవు

-లంచ్, ఇతర ఫుడ్

-ట్రైన్, ఫ్లైట్, బస్సు టికెట్లు అందించరు

-ఎంట్రన్స్ టికెట్లు పర్యాటకులే చెల్లించుకోవాలి

-టూర్ గైడ్ సర్వీసులు

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి