మంచి నిద్రకోసం.. అద్భుతమైన చిట్కాలు ఇవే

Samatha

2 6July 2026

నిద్ర ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకోసమే కంటి నిండ నిద్రపోవాలని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు.

కానీ కొంత మంది మాత్రం ఎప్పుడూ సరిగ్గా నిద్రపోరు. నిద్రలేమి వంటి సమస్యలు ఎక్కువగా ఎదుర్కుంటారు.

అంతే కాకుండా సరైన నిద్రలేకపోవడం వలన అనారోగ్య సమస్యల బారిన పడి, చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు.

అందువలన ఇప్పుడు మనం మంచి నిద్ర కోసం ఎలాంటి చిట్కాలు పాటించాలో వివరంగా తెలుసుకుందాం.

ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చటి పాలు తాగడం చాలా మంచిది. దీని వలన త్వరగా నిద్ర పోవచ్చు.

అంతే కాకుండా ఎప్పుడూ కూడా మీ గది చల్లగా ఉండేలా చేసుకోవాలి. దీని వలన మీరు ఆనందంగా నిద్రపోతారు.

అదే విధంగా ఎప్పుడూ కూడా సాయంత్రం తర్వాత కెఫిన్‌కు దూరంగా ఉండాలి. టీ, కాఫీలు అస్సలే తాగకూడదు.

అలాగే ప్రతి రోజూ తప్పకుండా శారీరక శ్రమ చేయాలి. దీని వలన రాత్రి సమయంలో త్వరగా నిద్ర వస్తుంది.