బ్లాక్ టీ ఎవరు తాగడం ఆరోగ్యానికి మంచిదో తెలుసా?

Samatha

2 6July 2026

బ్లాక్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది. అయినప్పటికీ  కొంత మంది అస్సలే దీనిని తాగకూడదంట. వారు ఎవరో చూద్దాం.

బ్లాక్ టీ శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. అయినప్పటికీ దీనిని  ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు ఉన్నవారు తాగకూడదు.

 అంతే కాకుండా,ఎవరు అయితే బీపీ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారు కూడా తాగకపోవడమే మంచిది.

గుండె సమస్యలు ఉన్నవారు కూడా వీలైనంత వరకు బ్లాక్ టీ తాగకపోవడం చాలా మంచిది. లేకపోతే ఇది గుండె దడ పెంచుతుంది.

మరీ ముఖ్యంగా ఎవరు అయితే నిద్రలేమి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, వారు వీలైనంత వరకు బ్లాక్ టీకి దూరం ఉండాలంట.

అంతే కాకుండా ఐరన్ లోపం ఉన్నవారు కూడా తీసుకోకూడదు. ఇందులో టానిన్ ఉంటుంది. దీని వలన రక్తహీనత పెరుగుతుంది.

బ్లాక్ టీలో ఆక్సలేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందువలన కిడ్నీ సమస్యలతో బాధపడే వారు కూడా దీనిని అతిగా తీసుకోకూడదు.

యాంగ్జైటీ, టెన్షన్, ఆందోళన, గుండె దడ  వంటివి ఎక్కువగా ఉన్నవారు కూడా వీలైనంత వరకు బ్లాక్ టీకి చాలా దూరం ఉండాలంట.