వర్షాకాలంలో నిమ్మరసం తాగడానికి బెస్ట్ సమయం ఏదో తెలుసా?

Samatha

2 6July 2026

నిమ్మరసం ఆరోగ్యానికి చాలామంచిది. వేసవి కాలంలో దీనిని ఎక్కువగా తీసుకుంటారు. ఇది శరీరానికి మేలు చేస్తుంది.

అయితే వేసవిలోనే కాదండోయ్, వర్షకాలలో నిమ్మరసం తాగినా బోలెడు లాభాలు ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

 కాగా, ఇప్పుడు మనం వర్షాకాలంలో నిమ్మరసం తాగడం వలన ఎలాంటి లాభాలు? అసలు దీనిని ఏ సమయంలో తాగాలో చూసేద్దాం.

ఉదయం పరగడుపున కాకుండా, పది నుంచి పదకొండు గంటల మధ్య నిమ్మరసం నీళ్లు తాగడం చాలా మంచిదంట.

ఈ సమయంలో తాగడం వలన ఇది జీర్ణశక్తిని పెంచడమే కాకుండా, రోగనిరోధక శక్తి కూడా పెరిగేలా చేస్తుంది.

అలాగే మధ్యాహ్నం సమయంలో  భోజనం చేసిన తర్వాత నిమ్మకాయ నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదంట.

మధ్యాహ్నం సమయంలో నిమ్మకాయ నీళ్లు తాగడం వలన ఇది కడుపు నొప్పి, గ్యాస్, అజీర్తి, వంటి సమస్యలను తగ్గించి, జీర్ణక్రియ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

నిమ్మకాయ నీరు ఆరోగ్యానికి మంచిదే కానీ ఎప్పుడూ కూడా వీటిని రాత్రి సమయంలో లేదా ఉదయం పరగడుపున తీసుకోకూడదంట.