ముందుగా మటన్ కాళ్ళను శుభ్రంగా కడిగి వాటిని కాల్చి, చిన్న చిన్న ముక్కలుగా వేడి నీటిలో మరిగించాలి
స్టెప్ -1
ఇప్పుడు ప్రెజర్ కుక్కర్‌లో కొద్దిగా ఆయిల్ వేసి అది వేడెక్కాక, మసాలా దినుసులు, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేయించాలి.
స్టెప్ -2
ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి అది మగ్గిన తర్వాత అర టీ స్పూన్ పసుపు,ఒక టేబుల్ స్పూన్ కారం, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి.
స్టెప్ -3
ఇప్పుడు ఇక ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న పాయ ముక్కలను వేసి 10 నిమిషాలు వేయించాలి
స్టెప్ -4
ఆ తర్వాత దానిలో ఒక గ్లాస్ నీళ్లు పోసి సన్నని మంటపై 5 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించాలి.
స్టెప్ -5
ఇక ఇప్పుడు మసాలా పొడి వేసి ముక్కలు మెత్తగా అయ్యే వరకు మరిగించాలి. చివర్లో కొత్తిమీర, రెండు టేబుల్ స్పూన్స్ నిమ్మరసం వేసి వేడిగా తాగితే రుచి అద్భుతంగా ఉంటుంది.