మార్చి 3న చంద్రగ్రహణం.. హోలీ జరుపుకుంటున్నారా?
ఈ ఏడాది హోలీ సంబరాలపై చంద్రగ్రహణం ప్రభావం పడింది. మార్చి 3వ తేదీన పౌర్ణమి మరియు చంద్రగ్రహణం ఒకే రోజు రావడంతో.. రంగుల పండుగను 3న జరుపుకోవాలా లేక 4న నిర్వహించుకోవాలా అనే సందిగ్ధత ప్రజల్లో నెలకొంది. దీనిపై పాలకుర్తి రాజ్యశ్యామల పీఠం జ్యోతిష్య పండితులు దేవగిరి సంతోష్ శర్మ స్పష్టతనిచ్చారు.
శాస్త్రం ప్రకారం, గ్రహణ సమయంలో ఎలాంటి శుభకార్యాలు, సంబరాలు జరుపుకోకూడదు. మార్చి 3న గ్రహణం ఏర్పడుతున్నందున, ఆ నెగిటివ్ ఎఫెక్ట్ పడకుండా ఉండేందుకు మార్చి 4వ తేదీన హోలీ జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. హోలికా దహనం అనేది చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతం. గ్రహణ సమయంలో పూజలు, వేడుకలు చేయడం వల్ల ఆశించిన ఫలితం దక్కదని, అందుకే మరుసటి రోజున సంబరాలు చేసుకోవడం శ్రేయస్కరమని వారు పేర్కొన్నారు. గ్రహణ సమయంలో భౌతిక వేడుకల కంటే ఆధ్యాత్మిక చింతన ఉత్తమమని పండితులు చెబుతున్నారు. ఆ సమయంలో చేసే జపం, అనుష్ఠానాలకు అధిక ఫలితం ఉంటుందని, గ్రహాల శక్తి ప్రభావం ఎక్కువగా ఉంటుందని వివరించారు.
మరిన్ని వీడియోల కోసం :
రేపే విజయ్, రష్మికల రిసెప్షన్.. కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు!
ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా?
అట్లీ సినిమాలో నాలుగు రోల్స్‌లో అల్లు అర్జున్
మరోసారి స్క్రీన్ మీదకు టిక్కెట్ రేట్ల కహానీ
Published on: Mar 03, 2026 12:27 PM
Follow Us
వైరల్ వీడియోలు
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
Latest Videos

