బీరు సీసా ‘గంట’.. రామచిలుకలకు ‘టాటా’
అవసరం అనేది మనిషికి అన్నీ నేర్పిస్తుంది అనే మాట మరోసారి నిజమైంది. అప్పులు చేసి పండించిన పంటను కళ్ళముందే పక్షులు నాశనం చేస్తుంటే.. చేష్టలుడిగి చూడకుండా తమ మేధస్సుకు ఆ రైతులు పదును పెట్టేలా చేసింది. మొక్కజొన్న పంటను రామచిలుకల బారి నుండి కాపాడుకునేందుకు 'బీరు సీసా గంట' అనే వెరైటీ ఐడియా సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరు గ్రామ రైతులు ఈ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా పక్షులను అదిలించడానికి మనుషులు కావాలి, కానీ ఇక్కడ గాలి ఉంటే చాలు.. ఆ గంటలే కాపలా కాస్తాయి. అదెలా అంటే… ఖాలీ బీరుసీసాలతో పొలాల్లో గంటల్లా వేలాడదీస్తారు. బీరుసీసా మూతికి ఒక పెద్ద ఇనుప మేకును జతచేసి దానిని పొలం చుట్టూ గట్లపై ఉన్న చెట్లకు వేళాడగడతారు. ఈ మేకుకు తేలికపాటి అట్టముక్కను కడతారు. గాలికి ఈ అట్టముక్క అటూ ఇటూ ఊగుతూ ఉంటుంది. అదేసమయంలో బీరుసీసాకు కట్టిన మేకు కదిలి సీసాకు తగలడంతో శబ్ధం వస్తుంది. ఈ శబ్ధానికి పొలాల్లో పంటను తినేస్తున్న చిలుకలు ఇతర పక్షులు పారిపోతున్నాయి.
ఒకవైపు కోతుల బెడద, మరోవైపు పశువుల సంచారంతో ఇబ్బంది పడుతున్న రైతులకు ఈ చిలుకల బెడద పెద్ద సమస్యగా మారింది. ఖరీదైన నెట్స్, పురుగుమందుల కంటే, కేవలం పాత సీసాలు, బోల్టులతో తయారుచేసిన ఈ ‘డెసిబెల్’ పరికరం అద్భుతంగా పనిచేస్తోందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కందుకూరు, మర్లపాడు పరిసరాల్లో సుమారు 20కి పైగా ఇలాంటి గంటలు ఇప్పుడు పంటలకు కాపలాగా నిలుస్తున్నాయి. రైతుల ఈ ‘దేశీ జుగాడ్’ చూసి నెటిజన్లు ఐడియా అదిరింది అంటూ ప్రశంసిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
రేపే విజయ్, రష్మికల రిసెప్షన్.. కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు!
ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా?
అట్లీ సినిమాలో నాలుగు రోల్స్‌లో అల్లు అర్జున్
మరోసారి స్క్రీన్ మీదకు టిక్కెట్ రేట్ల కహానీ
మనుషులను చల్లబరిచే ఫ్రిజ్.. లోపల 5 నిమిషాలు కూర్చుంటే చాలు
40 అడుగుల ఎత్తు నుంచి పడ్డ టూరిస్ట్! ఏం జరిగిందో మీరే చూడండి!
పెళ్లి కాని ప్రసాద్‌లకు గుడ్ న్యూస్..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్.. ఆ తర్వాత
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి

