Kiara Advani: సక్సెస్ ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా కియారా జోరు
పాన్ ఇండియా సినిమాలకు ప్రస్తుతం కియారా అద్వానీ హాట్ ఫేవరెట్‌గా మారారు. ఎన్టీఆర్-త్రివిక్రమ్ భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్‌తో పాటు యష్ నటిస్తున్న 'టాక్సిక్'లోనూ ఆమె పేరు వినిపిస్తోంది. తెలుగులో ఇప్పటివరకు పెద్ద విజయం లేకపోయినా, స్టార్ హీరోల సినిమాల్లో ఆమెకే తొలి ప్రాధాన్యం దక్కుతోంది. బాలీవుడ్, టాలీవుడ్ రెండింటిలోనూ వరుస భారీ ప్రాజెక్టులతో కియారా ఫుల్ బిజీగా కొనసాగుతున్నారు.
బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ ఫెయిల్యూర్‌తో సంబంధమే లేదు.. ఇప్పుడు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద భారీ పాన్ ఇండియా సినిమా ఎనౌన్స్ అయితే.. అందులో హీరోయిన్‌గా కియారా అద్వానీ పేరే వినిపిస్తోంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఏ ఇండస్ట్రీ అయినా, ఏ స్టార్ హీరో అయినా.. మేకర్స్ ఫస్ట్ ఛాయిస్ ఈ బ్యూటీనే. మరి అంతలా ఈ బాలీవుడ్ భామ పాన్ ఇండియా ప్రాజెక్టులను ఎలా పట్టేస్తోంది? అసలు కియారా లైనప్‌లో ఉన్న ఆ క్రేజీ సినిమాలేంటి? యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో భారీ మైథలాజికల్ మూవీ రెడీ అవుతోంది. ‘గాడ్ ఆఫ్ వార్’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ పౌరాణిక చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తారన్న టాక్ వినిపిస్తోంది. గతంలో కియారా చేసిన రెండు తెలుగు సినిమాలు నిరాశపరిచినా, ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్ విషయంలో ఈ బ్యూటీ పేరు ఫస్ట్ తెర మీదకు వస్తోంది. తెలుగులో రామ్ చరణ్‌కు జోడీగా నటించిన రెండు సినిమాలతో పాటు, తారక్ నటించి హిందీ మూవీ వార్ 2తో తెలుగు ఆడియన్స్‌కు దగ్గరయ్యారు కియారా అద్వానీ. అయితే ఆ సినిమాలన్నీ డిజాస్టర్ కావటంతో దక్షిణాదిలో బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కియారాను భారీ చిత్రాల్లో కాస్ట్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు సౌత్ మేకర్స్. ప్రజెంట్ గ్లోబల్ మూవీ టాక్సిక్‌లో హీరోయిన్‌గా నటిస్తున్నారు కియారా. ఆగస్టు 26న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ మూవీతో సౌత్‌లో తొలి సక్సెస్ దక్కుతుందన్న నమ్మకంతో ఉన్నారు. బాలీవుడ్‌లోనూ క్రేజీ ప్రాజెక్ట్స్ ఈ బ్యూటీ ఖాతాలో ఉన్నాయి. ఇంత బిజీలోనూ కొత్తగా ఏ ప్రాజెక్ట్ ఎనౌన్స్ అయినా అందులో ఫస్ట్ లీడ్‌గా కియారా పేరే తెర మీదకు వస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారా.. ఈ 5 లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి!
భారతీయులకు నిద్ర కరవు.. షాకింగ్ నిజాలు!
మనుషులను చల్లబరిచే ఫ్రిజ్.. లోపల 5 నిమిషాలు కూర్చుంటే చాలు
40 అడుగుల ఎత్తు నుంచి పడ్డ టూరిస్ట్! ఏం జరిగిందో మీరే చూడండి!
Tirumala: అన్నప్రసాదాల పంపిణీకి కొత్త టెక్నాలజీ టీటీడీ వినూత్న ప్రయోగం
మనుషులను చల్లబరిచే ఫ్రిజ్.. లోపల 5 నిమిషాలు కూర్చుంటే చాలు
40 అడుగుల ఎత్తు నుంచి పడ్డ టూరిస్ట్! ఏం జరిగిందో మీరే చూడండి!
పెళ్లి కాని ప్రసాద్‌లకు గుడ్ న్యూస్..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్.. ఆ తర్వాత
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి

