ఫ్యామిలీ కథలో ట్విస్ట్.. కాసులు కురిపిస్తున్న కొత్త ఫార్ములా
క్రైమ్ థ్రిల్లర్‌లకు ఫ్యామిలీ సెంటిమెంట్ జోడించిన కథలు ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్‌గా మారాయి. 'దృశ్యం'తో మొదలైన ఈ ఫార్ములాను 'పరిమళ అండ్ కో', 'బ్లాస్ట్', 'మా ఇంటి బంగారం' వంటి చిత్రాలు విజయవంతంగా కొనసాగించాయి. ఉత్కంఠ, భావోద్వేగాలు, యాక్షన్‌ను సమపాళ్లలో మేళవించిన ఈ జానర్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తూ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధిస్తోంది.
కోవిడ్ తరువాత వెండితెర మీద క్రైమ్ థ్రిల్లర్‌లకు మంచి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు అదే జానర్‌కు ఫ్యామిలీ సెంటిమెంట్‌ను కూడా జోడీస్తున్నారు మేకర్స్. సౌత్ ఇండస్ట్రీల్లో ఈ ట్రెండ్ గట్టిగా కనిపిస్తోంది. రీసెంట్ టైమ్స్‌లో ఈ జానర్‌లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. టాప్ స్టార్స్‌కు పోటీ ఇచ్చే రేంజ్‌లో కాసుల పంట పండించాయి. ఫ్యామిలీ క్రైమ్ డ్రామా అనగానే సౌత్‌లో ముందుగా గుర్తొచ్చే మూవీ ‘దృశ్యం’. ఓ సామాన్య మధ్యతరగతి తండ్రి తన కుటుంబాన్ని ఓ క్రైమ్ నుంచి కాపాడుకునేందుకు పడే తపన ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సిరీస్‌లో వచ్చిన మూడు సినిమాలు అదే స్థాయిలో మ్యాజిక్ చేయడంతో, మేకర్స్ ఈ జానర్‌లో మరిన్ని మూవీస్ ప్లాన్ చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించాలంటే, ఫ్యామిలీ సెంటిమెంట్‌కు థ్రిల్‌ను యాడ్ చేయటం బెస్ట్ ఆప్షన్‌గా మారిపోయింది. రీసెంట్‌గా ఈ ఫ్యామిలీ క్రైమ్ డ్రామాకు కాస్త కామెడీ టచ్ ఇస్తూ ‘పరిమళ అండ్ కో’ లాంటి డిఫరెంట్ మూవీస్ వచ్చాయి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఓ సాధారణ కుటుంబం, ఓ లోకల్ రౌడీ వల్ల ఊహించని క్రైమ్‌లో ఇరుక్కుంటే ఎలా ఉంటుందనే పాయింట్‌తో రూపొందిన సినిమా పరిమళ అండ్ కో. దృశ్యం తరహా థ్రిల్‌కు, హ్యూమర్ జోడించి రూపొందించిన ఈ సినిమా థియేట్రికల్ రన్‌తో పాటు డిజిటల్‌లోనూ మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. అర్జున్, అభిరామి, ప్రీత ముకుందన్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన బ్లాస్ట్ మూవీ కూడా ఫ్యామిలీ క్రైమ్ కథా చిత్రమే. అనుకోకుండా ఓ క్రైమ్‌లో ఇరుక్కున్న ఫ్యామిలీ, తమని తాము కాపాడుకునేందుకు ఓ విలన్ గ్యాంగ్‌ను ఎలా అంతం చేసిందనే పాయింట్‌ను ఈ సినిమాలో ఇంట్రస్టింగ్‌గా చూపించారు. ముఖ్యంగా ఈ మూవీలో యాక్షన్ సీన్స్‌కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. లేటెస్ట్ టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మా ఇంటి బంగారం కూడా ఇదే జానర్ మూవీ. సమంత లీడ్ రోల్‌లో నటించిన ఈ సినిమా ఏకంగా వంద కోట్ల క్లబ్‌లో చేరి సత్తా చాటింది. తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు ఓ యువతి చేసిన పోరాటమే మా ఇంటి బంగారం కథ. యాక్షన్ ఎంటర్‌టైన్మెంట్ పర్ఫెక్ట్‌గా బ్లెండ్ అయిన ఈ స్టోరి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అంతేకాదు ఈ జానర్‌లో మరిన్ని సినిమాలు చేసేందుకు ధైర్యాన్ని ఇచ్చింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారా.. ఈ 5 లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి!
భారతీయులకు నిద్ర కరవు.. షాకింగ్ నిజాలు!
మనుషులను చల్లబరిచే ఫ్రిజ్.. లోపల 5 నిమిషాలు కూర్చుంటే చాలు
40 అడుగుల ఎత్తు నుంచి పడ్డ టూరిస్ట్! ఏం జరిగిందో మీరే చూడండి!
Tirumala: అన్నప్రసాదాల పంపిణీకి కొత్త టెక్నాలజీ టీటీడీ వినూత్న ప్రయోగం
మనుషులను చల్లబరిచే ఫ్రిజ్.. లోపల 5 నిమిషాలు కూర్చుంటే చాలు
40 అడుగుల ఎత్తు నుంచి పడ్డ టూరిస్ట్! ఏం జరిగిందో మీరే చూడండి!
పెళ్లి కాని ప్రసాద్‌లకు గుడ్ న్యూస్..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్.. ఆ తర్వాత
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి

