Manjummel Boys: మంజుమ్మల్ బాయ్స్ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై 240 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన 'మంజుమ్మల్ బాయ్స్' సీక్వెల్, హిందీ రీమేక్‌పై వస్తున్న వార్తలకు దర్శకుడు చిదంబరం ఫుల్‌స్టాప్ పెట్టారు. ఇప్పటికే హిందీలో డబ్ చేసిన సినిమాను మళ్లీ రీమేక్ చేయాల్సిన అవసరం లేదన్నారు. అలాగే నిజ ఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి కల్పిత కథతో సీక్వెల్ తీయాలనే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.
ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన ‘మంజుమ్మల్ బాయ్స్’ బాక్సాఫీస్ సక్సెస్ అందరినీ ఆశ్చర్యపరిచింది. 240 కోట్లకు పైగా వసూళ్లు సాధించి మలయాళ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది ఈ చిన్న సినిమా. గుణ కేవ్స్ నేపథ్యంలో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ సర్వైవల్ థ్రిల్లర్.. కేవలం మలయాళంలోనే కాదు, సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నింటిలో బిగ్ హిట్ అయ్యింది. దీంతో ఈ సినిమా సీక్వెల్, రీమేక్‌కు సంబంధించి డిస్కషన్ జరుగుతోంది. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు బడా నిర్మాణ సంస్థలు ట్రై చేస్తున్నారు. ఒరిజినల్ వర్షన్‌ను డైరెక్ట్ చేసిన చిదంబరం కెప్టెన్సీలో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ ఆఫర్స్‌ను దర్శకుడు లైట్ తీసుకుంటున్నారు. ఇప్పటికే హిందీలో డబ్ చేసి రిలీజ్ చేశామని, మళ్లీ హిందీలో రీమేక్ చేయడం కరెక్ట్ కాదని ఆయన తేల్చి చెప్పారు. సినిమాకు ఉన్న సోల్ రీమేక్ చేస్తే మిస్ అవుతుందన్నారు. మంజుమ్మల్ బాయ్స్ 2 గురించి కూడా డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్. ‘మనం అంత క్రూరంగా ఎందుకు ఉండాలి? ఆ కుర్రాళ్లు మళ్లీ ఇంకో ప్రమాదంలో పడితేనే కదా సీక్వెల్ సాధ్యమయ్యేది’ అంటూ సెటైర్ వేశారు. ఈ సినిమాకు ఉన్న మెయిన్ అట్రాక్షన్ అది నిజంగా జరిగిన సంఘటన కావడమేనని, సీక్వెల్ చేయాలన్న ఉద్దేశంతో ఫిక్షనల్ స్టోరీ చేస్తే ఈ స్థాయలో మెప్పించదన్నారు. అంటే ఈ బ్లాక్‌బస్టర్‌కు ఎట్టిపరిస్థితుల్లోనూ సీక్వెల్ ఛాన్స్ లేనట్లే అని తేల్చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారా.. ఈ 5 లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి!
భారతీయులకు నిద్ర కరవు.. షాకింగ్ నిజాలు!
మనుషులను చల్లబరిచే ఫ్రిజ్.. లోపల 5 నిమిషాలు కూర్చుంటే చాలు
40 అడుగుల ఎత్తు నుంచి పడ్డ టూరిస్ట్! ఏం జరిగిందో మీరే చూడండి!
Tirumala: అన్నప్రసాదాల పంపిణీకి కొత్త టెక్నాలజీ టీటీడీ వినూత్న ప్రయోగం
భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా
హైదరాబాద్ వాసులకు అలర్ట్..డిసెంబర్ నుంచి నీటి కష్టాలు తప్పవా?
చంద్రుడి పై నివాసాలు.. అణు విద్యుత్ కు ప్రయోగాలు..
రష్యాలో ప్లేగు వ్యాధి పై క్రెమ్లిన్ చెప్పిందిదే
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు

