AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth Sunny: కోటీశ్వరుడైన జబర్దస్త్ సన్నీని లవర్ ఎందుకు వదిలేసిందో తెలుసా? అప్పటి నుంచే మందుకు బానిసై..

జబర్దస్త్ చూసే వారికి సన్నీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సుడిగాలి సుధీర్ టీమ్ తో కలిసి ఎన్నో కామెడీ స్కిట్లు చేశాడీ యాక్టర్. తన కామెడీతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. అయితే ఇది రీల్ లైఫ్ వరకే.. రియల్ లైఫ్ లో మాత్రం ఈ జబర్దస్త్ కమెడియన్ కు ఓ కన్నీటి బ్రేకప్ స్టోరీ ఉంది.

Jabardasth Sunny: కోటీశ్వరుడైన జబర్దస్త్ సన్నీని లవర్ ఎందుకు వదిలేసిందో తెలుసా? అప్పటి నుంచే మందుకు బానిసై..
Jabardasth Sunny
Basha Shek
|

Updated on: Mar 03, 2026 | 1:04 PM

Share

జబర్దస్త్ సన్నీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈనటుడి అసలు పేరు సునీల్ చంద్ర. సుడిగాలి సుధీర్ టీమ్ లో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సన్నీ. ఎప్పుడూ తాగుబోతు క్యారెక్టర్స్ వేస్తూ ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటాడు. అయితే ఎప్పుడూ ఫన్నీగా కనిపించే సన్నీ జీవితంలో ఒక బ్రేకప్ స్టోరీ ఉంది. 8 ఏళ్ల పాటు ప్రేమించిన ఒక అమ్మాయి అతనని సడెన్ గా వదిలేసి వెళ్లిపోయింది. వేరొకరిని పెళ్లి చేసుకుంది. ఆ అమ్మాయి సన్నీని మర్చిపోయినా ఈ జబర్దస్త్ కమెడియన్ మాత్రం ఇప్పటికీ ఆమెనే తలచుకుంటున్నాడట. ప్రేమించిన అమ్మాయి మోసం చేయడంతో ప్రేమ, పెళ్లి పై నమ్మకం కోల్పోయి నిజంగానే మందుకు బానిసయ్యాడట. అందుకే ఏజ్ ఎక్కువే ఉన్నా ఇప్పటికి పెళ్లి చేసుకోలేదట ఈ జబర్దస్త్ కమెడియన్. ఇప్పుడే కాదు అసలు పెళ్లి చేసుకోనని ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు సన్నీ.

‘నేను ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాను. తను కూడా నన్ను లవ్ చేసింది. సుమారు 8 ఏళ్ళు లవ్ చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి గవర్నమెంట్ జాబ్ ఉందని వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. అందుకే అప్పట్నుంచి పెళ్లి చేసుకోలేదు. ఇక ఇదే సన్నీ వ్యక్తిగత జీవితం గురించి అతని స్నేహితుడు, కమెడియన్ రామ్ ప్రసాద్ గురించి మాట్లాడుతూ.. ‘ సన్నీ మంచి కోటీశ్వరుడు. వాళ్ల దగ్గర బోలెడన్నీ డబ్బులు ఉన్నాయి. బ్రేకప్ తర్వాత పెళ్లి చేసుకోమన్నా చేసుకోలేదు. లవ్ ఫెయిల్యూర్ వల్ల లైఫ్ ని కూడా అలాగే వదిలేసాడు. వాళ్ల అన్నయ్య, వదిన పెద్ద డాక్టర్లు. పెళ్లి చేసుకో మంచిగా ఉండు అని చెప్పినా వినలేదు. లైఫ్ లో అన్నీ వదిలేశాడు. పెళ్లి చేసుకోమని ఎంతమంది చెప్పినా నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు అంటాడు. ఇంటికి కూడా రెగ్యులర్ గా వెళ్లడు. మా రూమ్ లోనే, లేదా ఎవరో రూమ్ లోనో తాగుతూ ఉండిపోతాడు’ అని అన్నాడు. ప్రస్తుతం ఈ జబర్దస్త్ కమెడియన్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

జబర్దస్త్ సన్నీ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ వీడియో..

హైపర్ ఆదితో జబర్దస్త్ సన్నీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us