హడలెత్తిస్తున్న పులి.. వణికిపోతున్న రైతులు
ఏపీలోని రెండు ప్రాంతాల్లో పులులు ఆ ప్రాంతాల వారిని వణికిస్తున్నాయి. తాజాగా మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం మండలంలో పులి భయం స్తానికుల్ని హడలెత్తిస్తోంది. గడ్డమీదపల్లె ఏరియాలో పులి సంచరిస్తున్న దృశ్యాలు ఫారెస్ట్ సిబ్బంది ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరా కు చిక్కాయి. గ్రామానికి సమీపంలో బీడు పొలంలో ఉన్న నీటి కుంట వద్ద పులి పాదముద్రలను గుర్తించిన రైతులు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అటవీశాఖ సిబ్బంది రాత్రి నీటి కుంట వద్ద ట్రాప్ కెమెరాలు ఎర్పాటు చేసారు. ఉదయం ఆ కెమెరాలను పరిశీలించగా అందులో పెద్ద పులి జాడలు కనిపించాయి. అంతే పొలాల వైపు వెళ్లాలంటేనే రైతులు, స్థానికులు గజగజలాడుతున్నారు.
నీళ్ల కోసం పులి మళ్లీ నీటి కుంట దగ్గరకు వస్తుందని ఫారెస్ట్ సిబ్బంది కాపుకాస్తున్నారు. పులి జాడలు కన్పించిన ప్రాంతంలోకి ఎవరూ ఒంటరిగా వెళ్లొద్దని గ్రామస్తులకు సూచించారు. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పులిని బంధించేందుకు ఆపరేషన్ చేపట్టారు. నల్లమల అడవి దగ్గరగా ఉండటం తో పులి అక్కడి నుంచే ఇటువైపు వచ్చిందని భావిస్తున్నారు. పులి తమ కంటపడితే బంధించి మళ్లీ అడవిలోకి తరలిస్తామన్నారు. మరోవైపు తూర్పు గోదావరి జిల్లాలోనూ పులి కలకలం రేపింది. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా ప్రజలను వారం రోజులపాటు వణికించగా.. ఎట్టకేలకు స్పెషల్ ఆపరేషన్‌తో బంధించారు. ఆ తర్వాత.. విశాఖ జూలో ట్రీట్‌మెంట్ చేసి.. పాపికొండల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. డీప్ ఫారెస్ట్‌లోకి వెళ్లిన అదే పులి.. మళ్లీ పల్లెబాట పట్టిందని రంపచోడవరం ఏజెన్సీ గ్రామాల్లో హైటెన్షన్ క్రియేట్ ఏర్పడింది. ఆయా గ్రామాల్లో పెద్దపులి పాదముద్రలు గుర్తించిన అటవీ శాఖ అధికారులు.. బోలకొండ, తాళ్లపాలెం, భీమవరం, చొప్పరిపాలెం, చెరువూరు, నిమ్మలపాలెం, గుంజుగూడెం గిరిజన గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఇప్పటికీ తాళ్లపాలెం గ్రామస్తులు.. ఫారెస్ట్ సిబ్బందితో కలిసి రాత్రుళ్లు గస్తీ కాస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
రేపే విజయ్, రష్మికల రిసెప్షన్.. కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు!
ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా?
అట్లీ సినిమాలో నాలుగు రోల్స్‌లో అల్లు అర్జున్
మరోసారి స్క్రీన్ మీదకు టిక్కెట్ రేట్ల కహానీ
హడలెత్తిస్తున్న పులి.. వణికిపోతున్న రైతులు
బీరు సీసా 'గంట'.. రామచిలుకలకు 'టాటా'
ఒకే కాన్పులో ఐదుగురు.. అది కూడా నార్మల్ డెలివరీ .. అరుదైన ఘటన
చనిపోతావని జ్యోతిష్కుడు చెప్పడంతో.. ఉరేసుకున్న టెకీ
దండకారణ్యంలో శ్రీరాముడి చారిత్రక ఆనవాళ్లు..
బయట రాష్ట్రాల్లో ఉండే వాళ్ళు ఏపీ గురించి సలహాలు.. ఇవ్వొద్దు
తెలుగునాడుగా మార్చండి.. గరికపాటి సంచలన వ్యాఖ్యలు

