మట్టి కుండలో చికెన్ మిరియాల చారు.. దగ్గుతో బాధపడే వారికి ఇదే బెస్ట్ మెడిసిన్
Prasanna Yadla
03 March 2026
Pic credit - Pixabay
మట్టి పాత్రలో ఏది చేసిన కూడా రుచికరంగా ఉంటుంది. అయితే, దానిలో చికెన్ మిరియాల చారు చేసి తాగితే దగ్గుతో బాధపడే వారికి ఉపశమనం కలుగుతుంది.
మట్టి కుండలో చికెన్ మిరియాల చారు
అరకిలో చికెన్, మట్టి కుండ ఒకటి, నల్ల మిరియాలు, ఒక ఉల్లిపాయ, రెండు టమోటాలు, ఒక టేబుల్ స్పూన్
అల్లం-వెల్లుల్లి పేస్ట్, 10 కరివేపాకు, అర టీ పసుపును తీసుకోవాలి.
కావాల్సిన పదార్ధాలు
ముందుగా మట్టి కుండను తీసుకుని దానిని శుభ్రం చేసి పొయ్యి మీద పెట్టుకోవాలి. ఆ తర్వాత దీనిలో కొద్దిగా నూనె వేసి అల్లం వెల్లులి
పేస్ట్ వేసి వేయించాలి.
స్టెప్ - 1
ఆ తర్వాత దానిలో ఉల్లిపాయలు ముక్కలు, కరివేపాకు ఆకులు వేసి రంగు మారే వరకు బాగా వేయించాలి.
స్టెప్ - 2
కొద్దీ సేపటి తర్వాత కట్ చేసిన టమోటా ముక్కలు, అర టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు వేసి బాగా మగ్గించాలి.
స్టెప్ - 3
ఇప్పుడు ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలను తీసుకుని, నూనెలో 10 నిమిషాల పాటు బాగా వేయించాలి.
స్టెప్ - 4
చికెన్ ముక్కలు ఉడకడానికి రెండు గ్లాస్ లు నీళ్లు పోసి, మూత పెట్టి 20 నిముషాల పాటు బాగా ఉడికించాలి.
స్టెప్ - 5
చికెన్ ముక్కలు మగ్గిన తర్వాత, మిరియాల పొడి వేసి 5 నిమిషాలు ఉంచి కొత్తిమీర వేసి కిందకు దించేయండి.