AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ పండ్లు ఎక్కడ కనిపించినా వదలకండి..! క్యాన్సర్‌ను సైత ఖతం చేసే శక్తివంతమైనవి..

మల్బరీగా పిలువబడే ఈ పండ్లు మార్కెట్లో మనకు కనిపిస్తూనే ఉంటాయి. సాధారణంగా వీటిని బొంత పండ్లు అని కూడా పిలుస్తారు. మల్బరీలు చూడటానికి బ్లాక్‌బెర్రీస్‌ మాదిరిగా కనిపిస్తాయి. ఇవి రుచిలో మాత్రం ద్రాక్షపండులా ఉంటాయి. ఈ మల్బరీస్ బ్లాక్‌, రెడ్‌, వైట్‌ ఇలా మూడు రంగుల్లో ఉంటాయి. దీనిలో పోషకాలూ మాత్రం పుష్కలంగా ఉంటాయి. వీటిలో మన ఆరోగ్యానికి మేలు చేసే.. ఫైటోన్యూట్రియెంట్ సమ్మేళనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మరిన్ని లాభాలేంటో ఇక్కడ చూద్దాం..

ఈ పండ్లు ఎక్కడ కనిపించినా వదలకండి..! క్యాన్సర్‌ను సైత ఖతం చేసే శక్తివంతమైనవి..
Mulberry Fruits
Jyothi Gadda
|

Updated on: Nov 09, 2025 | 2:06 PM

Share

మల్బరీలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. మల్బరీ తినడం వల్ల సీజనల్ ఇన్ఫెక్షన్లు మొదలైన వాటితో పోరాడటానికి, నివారించడంలో సహాయపడుతుంది. మల్బరీస్ చిన్నగా కనిపించినప్పటికీ, మీ బరువును తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. ఎముకల బలానికి ఇనుము, కాల్షియం చాలా ముఖ్యమైనవి. ఈ రెండు పోషకాలు మల్బరీలో ఉంటాయి. కాబట్టి వీటిని తినడం వల్ల ఎముకలు బలహీనపడకుండా ఉంటాయి.

ఈ చిన్న జ్యుసి పండ్లు మీ హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి కూడా సహాయపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. మల్బరీలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ సి లభిస్తాయి. ఈ రెండూ చర్మానికి చాలా మేలు చేస్తాయి. ఈ వేసవి పండ్లు ఎక్కడ కనిపించినా వదలకండి..మల్బరీలో పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, సోడియం, జింక్ , విటమిన్ సి, ఇ, కె, B1, B2, B3, B6, ఫోలెట్‌ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

పాలీఫెనాల్ పిగ్మెంట్ యాంటీఆక్సిడెంట్లు, లిపిడ్లు, ప్రోటీన్, డైటరీ ఫైబర్‌ కూడా సమృద్ధిగా ఉంటాయి. మల్బరీలు తీసుకోవటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. మల్బరీ పండ్లోల జీర్ణక్రియకు మేలు చేసే డైటరీ ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఇది పేగు కదలికలను సులభతరం చేస్తుంది. మలబద్ధకం, ఉబ్బరం, కడుపు తిమ్మిరి సమస్యలను దూరం చేస్తుంది. మల్బరీలు బరువు తగ్గడానికి సహాయపడతాయి. మల్బరీ పండ్లలో క్యాన్సర్‌ కణాలను నిర్మూలించే ఆంథోసైనిన్‌లు ఉంటాయి. వీటిలో రెస్వెరాట్రాల్‌‌ కూడా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

వీటికి క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉంటాయి. తద్వారా పెద్దప్రేగు క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్లతో పోరాడటానికి సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గుండె నుంచి ఇతర భాగాలకు రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. హైపర్‌టెన్షన్‌ కంట్రోల్‌లో ఉంటుంది. ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ప్రొత్సహిస్తుంది. మల్బరీలు రోగనిరోధక వ్యవస్థను అప్రమత్తంగా ఉంచుతాయి.

మల్బరీలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. మల్బరీలో విటమిన్‌ కె, కాల్షియం, ఐరన్‌ ఎముక కణజాలం, ఎముకలను నిర్మించడానికి తోడ్పడతాయి. ఎముక క్షీణత, బోలు ఎముకల వ్యాధి, ఆర్థరైటిస్ వంటి సమస్యల నుంచి రక్షిస్తాయి. ఇటలీకి చెందిన ఎఫ్. డి రిటిస్ ఇన్‌స్టిట్యూట్ & కాథలిక్ యూనివర్శిటీ ఆఫ్ సేక్రేడ్ హార్ట్ నిర్వహించిన అధ్యయనంలో.. మల్బరీలను తమ రోజువారీ డైట్ ప్లాన్‌లో 1,300 కేలరీలు తీసుకునే వారు, దాదాపు మూడు నెలల వ్యవధిలో వారి మొత్తం శరీర బరువులో 10% తగ్గించుకుంటారని తెలిపింది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..