AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: ఉద్యోగం అవసరం లేదు.. ఈ చిన్న బిజినెస్‌ స్టార్ట్ చేస్తే మీరే కింగ్.. బోలెడు డబ్బులు..

ప్రస్తుతం పట్టణాలకు కూడా వ్యాపారాలన్నీ విస్తరిస్తున్నాయి. ఒకప్పుడు సిటీలకే పరిమితమైన కొన్ని రంగాలు ఇప్పుడు పట్టణ స్థాయికి చేరుకుంటున్నాయి. అలాంటి వాటిల్లో బ్యూటీ రంగం ఒకటి. దీంతో బ్యూటీ పార్లర్ లేదా సెలూన్ ఏర్పాటు చేసుకోవడం వల్ల అధిక ఆదాయం పొందవచ్చు.

Business Idea: ఉద్యోగం అవసరం లేదు.. ఈ చిన్న బిజినెస్‌ స్టార్ట్ చేస్తే మీరే కింగ్.. బోలెడు డబ్బులు..
Business Idea
Venkatrao Lella
|

Updated on: Nov 17, 2026 | 2:51 PM

Share

ప్రస్తుత కాలంలో చర్మ సౌందర్యం గురించి ఎక్కువమంది ఆసక్తి కనబరుస్తున్నారు. అందంగా కనిపించాలని తహతహలాడుతున్నారు. ఇక పండుగలు, పెళ్లిళ్లు, పంక్షన్ల సమయంలో అయితే అందరిలోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలవాలని మేకోవర్ చేసుకుంటారు. దీంతో ప్రస్తుత ఆధునిక యుగంలో బ్యూటీ పార్లర్లతో పాటు సౌందర్య ఉత్పత్తులకు భారీగా డిమాండ్ ఉంది. మెట్రోపాలిటన్ సిటీలలోనే కాదు పట్టణాలకు కూడా బ్యూటీ రంగం విస్తరిస్తోంది. అబ్బాయిలు, అమ్మాయిలు అనే తేడా లేకుండా ప్రతీఒక్కరూ తమ అందంపై దృష్టి పెడుతున్నారు. ఇలాంటి తరుణంలో ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని స్థానికంగానే స్వయం ఉపాధి పొందవచ్చు. ఇందుకు మంచి ఆప్షన్ బ్యూటీ పార్లర్ లేదా సెలూన్ బిజినెస్. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం ఈ వ్యాపారం ద్వారా పొందవచ్చు. ఎప్పుడూ ఈ బిజినెస్‌కు డిమాండ్ ఉంటుంది.

ఖర్చు ఎంత అవుతుంది..?

బ్యూటీ పార్లర్ లేదా సెలూన్ ఏర్పాటు కోసం రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతుంది. మెషీన్లు, పరికరాలు, కుర్చీలు, అద్దాలు, ఫర్నీచర్‌కు రూ.2 లక్షల వరకు వెచ్చించాల్సి ఉంటుంది. ఇక మీ సొంత స్థలంలో ఏర్పాటు చేసుకుంటే ఎలాంటి ఖర్చు ఉండదు. అదే అద్దెకు తీసుకుని ఏర్పాట్లు చేసుకుంటే రూమ్ రెంట్ వంటివి అదనంగా ఉంటాయి. ఉద్యోగిని పెట్టుకుంటే అదనంగా కొంతమేర ఖర్చు అవుతుంది.

కేంద్రం నుంచి రుణ సౌకర్యం

మీరు బ్యూటీ పార్లర్ లేదా సెలూన్ ఏర్పాటు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి రుణం కూడా పొందవచ్చు. ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం ద్వారా మీ సమీపంలోని బ్యాంక్‌కు వెళ్లి లోన్ పొందవచ్చు. ఈ రుణానికి ఎలాంటి పూచీకత్తు, ఆస్తులు తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. దరఖాస్తు ఫారం పూర్తి చేసి అవసరమైన పత్రాలు, మీ బిజినెస్ ప్లాన్ అందిస్తే సరిపోతుంది. చిన్న వ్యాపారాల కోసం రూ.10 లక్షల వరకు లోన్ పొందవచ్చు. వడ్డీ రేట్లు బ్యాంకు‌ను బట్టి మారుతుంటాయి. ఏడాదికి 9 నుంచి 12 శాతం వరకు వడ్డీ ఉంటుంది. సకాలంలో తిరిగి చెల్లిస్తే వడ్డీ మాఫీ సౌకర్యం కూడా ఉంటుంది. ఈ రుణానికి కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తుంది. దీంతో మీ ఆస్తులు తాకట్టు పెట్టాల్సిన పని ఉండదు.

లైసెన్స్ అవసరమా..?

సెలూన్ లేదా బ్యూటీ పార్లర్ నడిపేందుకు లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. పురపాలక సంస్థ నుంచి వ్యాపార లైసెన్స్‌తో పాటు జీఎస్టీ వంటి పత్రాలు పొందాలి. దీని వల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉండవు. షాపుకు అవసరమైన అనుమతులన్నీ తీసుకుని స్టార్ట్ చేయండి. దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు పడకుండా ఉండారని చెప్పవచ్చు. అలాగే మీ ప్రాంతంలోని డిమాండ్‌ను బట్టి ధరలను నిర్ణయించింది. కస్టమర్లకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించడం వల్ల మీపై నమ్మకం పెరుగుతుంది. దీని వల్ల మరోసారి కస్టమర్లకు మీ షాపుకు వచ్చే అవకాశముంటుంది.

Follow Us