నరాల బలహీనత నుంచి కీళ్ల నొప్పుల వరకు అన్నీ మటాష్.. అన్నం బదులు దీన్ని తినండి..
కొర్రలు లేదా ఫాక్స్‌టెయిల్ మిల్లెట్ పోషకాలు సమృద్ధిగా ఉండే చిరుధాన్యం. ఇందులోని ఫైబర్, ప్రోటీన్లు, ఖనిజాలు జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి. సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకుంటే మొత్తం ఆరోగ్యానికి తోడ్పడుతుంది. కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వీటిని తీసుకోవడం వల్ల చాలా మేలు జరిగే అవకాశం ఉందని డైటీషియన్లు సూచిస్తున్నారు.

ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ధాన్యాలలో సిరిధాన్యాలు ఒకటి. వీటిలో ప్రత్యేకంగా కొర్రలు, లేదా ఫాక్స్ టెయిల్ మిల్లెట్ (ఇటాలియన్ మిల్లెట్) అని పిలవబడే ధాన్యం, అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ధాన్యం ముఖ్యంగా నరాల, కీళ్ల ఆరోగ్యానికి ఒక వరంలా పనిచేస్తుంది. కొర్రలు పసుపు రంగులో ఉంటాయి.. ఇది అవి తక్కువ పాలిష్ చేయబడినవని సూచిస్తుంది. అధిక పాలిషింగ్ వల్ల ధాన్యం దాని పోషకాలను కోల్పోతుంది. కొర్రలలో సుమారు 8% ఫైబర్ ఉంటుంది.. ఇది జీర్ణవ్యవస్థకు, శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి చాలా అవసరం. ఐదు సిరిధాన్యాలలో కెల్లా కొర్రలు అత్యంత సమతుల్యమైన ధాన్యం, ఇందులో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, వివిధ విటమిన్‌లు సరైన నిష్పత్తిలో ఉంటాయి.
కొర్రలు (Foxtail Millet) పోషకాలు..
కొర్రల్లో పోషకాలు.. ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్, ప్రోటీన్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, మాంగనీస్, జింక్, విటమిన్ B1 (థయామిన్), విటమిన్ B2 (రిబోఫ్లేవిన్), యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గ్లూటెన్ రహిత చిరుధాన్యం.. అందుకే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
నరాల ఆరోగ్యానికి కొర్రల పాత్ర:
కొర్రల ప్రధాన ప్రయోజనాలలో ఒకటి నరాలను శుభ్రపరచడం, వాటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం. నరాలకు సంబంధించిన అనేక రకాల వ్యాధుల నివారణకు, చికిత్సకు ఇది ఎంతగానో సహాయపడుతుంది.
పిల్లలకు కొర్రలు మంచి ఆహారం. కొర్రలు నరాలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. మానసిక పరిస్థితులతో బాధపడే పిల్లలకు కొర్రలు చాలా ప్రయోజనకరమైనవి. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇది తోడ్పడుతుంది.
మధుమేహం ఉన్నవారిలో అరికాళ్ళలో మంట, స్పర్శ తెలియకపోవడం, గాయాలు తగిలినా నొప్పి లేకపోవడం వంటి న్యూరోపతి సమస్యలు వస్తాయి. కొర్రలు దెబ్బతిన్న నరాలను బాగుచేయడానికి సహాయపడతాయి. పార్కిన్సన్స్, అల్జీమర్స్ వంటి వ్యాధులు వయస్సు పెరిగే కొద్దీ మెమరీ లాస్, గుర్తింపు కోల్పోవడం వంటి లక్షణాలతో వస్తాయి. ఈ రకమైన నరాల క్షీణతను నివారించడానికి కొర్రలు చాలా మంచివి.
కీళ్ల, వెన్నెముక ఆరోగ్యానికి కొర్రల ప్రయోజనాలు:
రుమటిజం, ఆస్టియో ఆర్థరైటిస్, రుమాటిక్ ఆర్థరైటిస్ వంటి వివిధ రకాల కీళ్ల నొప్పులతో బాధపడేవారికి కొర్రలు చాలా మంచివి. సయాటికా, సర్వైకల్ స్పాండిలోసిస్ వంటి సమస్యలు వెన్నెముకలోని డిస్క్‌ల మధ్య నరాలపై ఒత్తిడి వల్ల వస్తాయి. ప్రతి వెన్నుపూస మధ్య నుండి నరాలు బయటకు వస్తాయి. ఈ స్పేస్ తగ్గినా లేదా ఒక వెన్నుపూస కదిలినా నరాలపై ఒత్తిడి పడి నొప్పి వస్తుంది (మెడ నొప్పి, చేయి లాగడం, కాలు లాగడం). కొర్రలు ఈ నరాలు, కీళ్లకు బలాన్ని చేకూర్చి నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.
కొర్రలు కేవలం ఒక ధాన్యం మాత్రమే కాదు, ఇది సంపూర్ణ ఆరోగ్యానికి, ముఖ్యంగా నరాల, కీళ్ల వ్యవస్థలకు ఒక శక్తివంతమైన మద్దతు అందిస్తాయి.. ఈ సిరిధాన్యాన్ని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
అయితే.. ఇది కేవలం అవగాహాన కోసం మాత్రమే.. ఏమైనా అనారోగ్య సమస్యలుంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.
