AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరిస్తే కోపం తగ్గుతుందా.. అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వడం పక్కా..

చాలా మంది కోపం, ఒత్తిడి తగ్గించుకోవడానికి అరుస్తుంటారు. అయితే పరిశోధనల ప్రకారం.. అరవడం వల్ల ఒత్తిడి తగ్గదు సరికదా.. శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. అరుపులు కార్టిసాల్ స్థాయిలు, రక్తపోటు పెంచి అనేక సమస్యలకు దారితీస్తాయి. అరవకుండా ఉండటానికి లోతైన శ్వాస, ధ్యానం వంటి చిట్కాలు పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.

అరిస్తే కోపం తగ్గుతుందా.. అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వడం పక్కా..
How Shouting Increases Health Risks
Krishna S
|

Updated on: Nov 16, 2025 | 6:35 PM

Share

సాధారణంగా చాలా మంది తమ కోపం లేదా ఒత్తిడిని తగ్గించుకోవడానికి పెద్దగా అరుస్తారు లేదా కేకలు వేస్తారు. అరుపులను తమ కోపాన్ని బయటపెట్టే ఒక మార్గంగా భావిస్తారు. అయితే పరిశోధనల ప్రకారం.. అరవడం వల్ల ఒత్తిడి తగ్గకపోగా.. అది సమస్యను, శారీరక ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తుంది. కోపంతో అరవడం మన శరీరంపై, మనస్సుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.

కోపంతో అరిస్తే ఏం జరుగుతుంది?

మనం కోపంతో అరుస్తున్నప్పుడు అది ఉపశమనాన్ని ఇవ్వకపోగా.. మన మనస్సును, శరీరాన్ని మరింతగా ఒత్తిడికి గురి చేస్తుంది. మీరు అరుస్తున్నప్పుడు మీ శరీరం అప్రమత్తమై ఫైట్ మోడ్‌లోకి వెళుతుంది. ఇది ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయిలను పెంచుతుంది. అలాగే అడ్రినలిన్ కూడా యాక్టివేట్ అవుతుంది. అంటే మీరు అరవడానికి బదులుగా మీ మెదడును మరింత కోపంగా ఉండమని చెబుతున్నట్లు లెక్క. అంతేకాకుండా అరుపు వల్ల రక్తపోటు పెరుగడం, గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస భారంగా మారడం, కండరాలు బిగుసుకుపోవడం జరుగుతాయి.

ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాలు

కోపంతో అరవడాన్ని శరీరం ఒక ప్రమాదకరమైన పరిస్థితిగా గ్రహిస్తుంది. ఈ పరిస్థితి ఎక్కువసేపు కొనసాగితే..

  • నిద్ర చెదిరిపోతుంది.
  • మెదడు త్వరగా అలసిపోతుంది.
  • శరీర రోగనిరోధక శక్తి తగ్గుతుంది.
  • కడుపు సమస్యలు, తలనొప్పి, మైగ్రేన్ల ప్రమాదం పెరుగుతుంది.
  • కోపం తగ్గిన కొద్దిసేపటి తర్వాత అసౌకర్యం, తలనొప్పి మరింత పెరుగుతాయి.

అరవడం పరిష్కారం కాదు..

చాలా మంది అరవడం ద్వారా సమస్య పరిష్కారమవుతుందని లేదా కోపం బయటపడుతుందని అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం.. అరవడం వల్ల సమస్యలు తొలగిపోవు. బదులుగా మిమ్మల్ని బాధపెడుతున్న విషయాలు మరింతగా మనసుకు గుర్తు చేస్తాయి. నిజమైన సమస్యలను ఎదుర్కోకుండా కేవలం అరిచి ఏదో చేసినట్లు భావించడం వల్ల అసలు సమస్య అలాగే ఉండిపోతుంది.

అరవకుండా ఉండాలంటే ఏం చేయాలి?

కోపంలో అరవకుండా ఉండటానికి ఈ సులభమైన చిట్కాలు పాటించండి:

వెంటనే స్పందించవద్దు: కోపం వచ్చినప్పుడు వెంటనే మాట్లాడటం మానేసి 10 నుండి 15 సెకన్లు ఆలోచించండి.

లోతైన శ్వాస: 3 నుండి 4 లోతైన శ్వాసలు తీసుకోండి. ఇది శరీరంలోని ఉద్రిక్తతను తగ్గిస్తుంది.

తాత్కాలిక విరామం: కాసేపు ఎక్కడికైనా వెళ్లి నీరు త్రాగండి. ఇది మనస్సును ప్రశాంతపరుస్తుంది.

ప్రశాంతంగా మాట్లాడండి: కోపంలో మాట్లాడితే తప్పుడు పదాలు వస్తాయి. కాబట్టి ప్రశాంతమైన మనస్సుతో మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారో తర్వాత చెప్పండి.

ధ్యానం: ప్రతిరోజూ 10 నిమిషాలు ధ్యానం చేయడం వల్ల మీ కోపం యొక్క తీవ్రత తగ్గుతుంది.

అరవడం మానేస్తే ప్రయోజనాలు

అరవడం మానేస్తే మీ జీవితంలో అనేక సానుకూల మార్పులు వస్తాయి. సంబంధాలలో దూరం తగ్గుతుంది. ఒత్తిడి హార్మోన్లు తగ్గుతాయి, అధిక రక్తపోటు, తలనొప్పి సమస్యలు తగ్గుతాయి. స్వీయ నియంత్రణ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..