AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: ఇదేం దౌర్జన్యం..? రసీదు ఇవ్వకుండానే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు సీజ్.. వీడియో వైరల్

ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఏ మూలన విన్నా.. గ్యాస్ సంక్షోభం గురించే. పశ్చిమాసియా దేశాల్లో భీకర యుద్ధం నేపథ్యంలో భారతదేశంలో గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. చేసేది లేక ప్రజలు మళ్లీ కట్టెల పొయ్యిని నమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా ప్రాంతాల్లో హోటళ్లు, రెస్టారెంట్లలో గ్యాస్ కొరత కారణంగా వ్యాపారం చతికిలపడిన మాట వాస్తవం..

Watch: ఇదేం దౌర్జన్యం..? రసీదు ఇవ్వకుండానే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు సీజ్.. వీడియో వైరల్
Domestic Gas Cylinders
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Mar 19, 2026 | 7:03 PM

Share

హైదరాబాద్, మార్చి 19:  మూడు పువ్వులు ఆరు కాయలుగా వ్యాపారాన్ని విస్తరించుకున్న ఎంతో మంది హోటల్, రెస్టారెంట్ల యజమానులు కష్టాలను చవిచూస్తున్నారు. ఈ క్రమంలో ఓ హోటల్‌లో ఉపయోగిస్తున్న డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్‌ను అధికారులు ఎలాంటి సీజ్ రసీదు ఇవ్వకుండా స్వాధీనం చేసుకోవడం స్థానికంగా కలకలం సృష్టించింది. అసలే వ్యాపారులు కష్టాల కడలిలో మునిగిపోయి ఉన్నారంటే.. మరోవైపు అధికారుల విధానాలు మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా పరిధి బాబానగర్ ప్రాంతంలో గ్యాస్ సిలిండర్‌ను స్వాధీనం చేసుకోవడంపై జరిగిన హంగామా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఘటనలో.. ఒక హోటల్‌లో ఉపయోగిస్తున్న డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్‌ను అధికారులు ఎలాంటి సీజ్ రసీదు ఇవ్వకుండా స్వాధీనం చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై హోటల్ యజమాని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడే నానా హంగామా చేశారు. అధికారులు సరైన విధానాన్ని పాటించకుండా చర్యలు ఎలా తీసుకుంటారని ఆ యజమాని నిలదీశారు. ఏదో ఒకటి నచ్చజెపుదామని ఆ అధికారి ప్రయత్నిస్తున్నప్పటికీ హోటల్ యజమాని ఎంతకీ మాట వినలేదు. ప్రస్తుత ప్రభుత్వ నియమాలను అనుసరించి తీసుకెళ్లే అధికారం ఉన్నప్పటికీ, రసీదు ఇవ్వకుండా ఎలా తీసుకెళ్తారని హోటల్ యజమానితో పాటు స్థానికులు సైతం రోడ్డుపైనే హంగామా మొదలెట్టారు.

సాధారణంగా వాణిజ్య అవసరాల నిమిత్తం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల వినియోగం నిషేధించబడింది. అయితే, అధికారులు స్వాధీనం చేసుకునే సమయంలో మాత్రం అధికారికంగా రసీదు ఇవ్వడం తప్పనిసరి. ఈ నియమాన్ని పాటించకుండా రసీదు లేకుండానే సిలిండర్ తీసుకెళ్లడమే ఈ వివాదానికి కారణమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న గ్యాస్ సిలిండర్లను వినియోగించి వ్యాపారం చేసుకుంటుంటే, ఇలా దౌర్జన్యంగా తీసుకెళ్లి వ్యాపారాన్ని మరింత దిగజారుస్తున్నారని అధికారితో హోటల్ యజమాని వాగ్వాదానికి దిగడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
వాస్తు ప్రకారం డబ్బు నిల్వ పెరగాలంటే ఇవి తప్పక చేయాలి!
వాస్తు ప్రకారం డబ్బు నిల్వ పెరగాలంటే ఇవి తప్పక చేయాలి!
ఇదేందౌర్జన్యం? రసీదు ఇవ్వకుండానే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల సీజ్
ఇదేందౌర్జన్యం? రసీదు ఇవ్వకుండానే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల సీజ్
జబర్దస్త్ నుంచి నెలకు ఎంత సంపాదించానంటే..
జబర్దస్త్ నుంచి నెలకు ఎంత సంపాదించానంటే..
133 కిలోల బరువున్న మహిళ.. ఈ ట్రిక్స్‌తో 76 కిలోలు తగ్గింది.. ఎలా
133 కిలోల బరువున్న మహిళ.. ఈ ట్రిక్స్‌తో 76 కిలోలు తగ్గింది.. ఎలా
దండెంపై ఆరేసిన జాకెట్ పొరుగింట్లో ప్రత్యక్షం.. ఏరులై పారిన రక్తం!
దండెంపై ఆరేసిన జాకెట్ పొరుగింట్లో ప్రత్యక్షం.. ఏరులై పారిన రక్తం!
'150 శాతం ఎఫర్ట్ ఇచ్చేందుకే 6 నెలలు మందు మానేశా'
'150 శాతం ఎఫర్ట్ ఇచ్చేందుకే 6 నెలలు మందు మానేశా'
రోడ్డున పడ్డప్పుడు మమ్మల్ని ఆదుకున్న దేవుడు ఆయనే..
రోడ్డున పడ్డప్పుడు మమ్మల్ని ఆదుకున్న దేవుడు ఆయనే..
హైదరాబాద్ నుంచి కేరళ అడ్వెంచర్: ఐఆర్‌సీటీసీ సూపర్ డీల్ టూర్..
హైదరాబాద్ నుంచి కేరళ అడ్వెంచర్: ఐఆర్‌సీటీసీ సూపర్ డీల్ టూర్..
పదో తరగతి హిందీ క్వశ్చన్ పేపర్ లిక్‌.. వాట్సప్‌లో చక్కర్లు!
పదో తరగతి హిందీ క్వశ్చన్ పేపర్ లిక్‌.. వాట్సప్‌లో చక్కర్లు!
వేసవిలో మట్టి కుండలో నీరు తాగడం మంచిదా? కుండ నాణ్యతను ఇలా..
వేసవిలో మట్టి కుండలో నీరు తాగడం మంచిదా? కుండ నాణ్యతను ఇలా..